News March 6, 2025
కౌలు రైతులకు ‘అన్నదాత సుఖీభవ’: అచ్చెన్నాయుడు

AP: రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రూ.20 వేలు ఆర్థిక సాయం ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. సీఆర్సీ కార్డులు లేకుండానే ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్నవారికి సాయం అందిస్తామన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. అలాగే ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు బడ్జెట్లో రూ.9,400 కోట్లు కేటాయించామని వెల్లడించారు.
Similar News
News March 6, 2025
BIG BREAKING: హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. కాగా భూసేకరణను వ్యతిరేకిస్తూ, ఇక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం చెబుతూ దాఖలైన పిటిషన్లపై పలువురు కోర్టును ఆశ్రయించారు. ఆయా ప్రాంతాల్లో భూసేకరణ సమయంలో ఆందోళనలు జరిగి పలువురిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
News March 6, 2025
అర్ధనారీశ్వర విగ్రహానికి భూమి పూజ.. జగన్‌కు ఆహ్వానం

AP: కర్ణాటక నందీపురలో ఏప్రిల్ 30న ప్రపంచంలోనే ఎత్తయిన 108 అడుగుల శ్రీఅర్ధనారీశ్వర విగ్రహానికి భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం జగన్‌ను నందీపుర పీఠాధిపతులు ఆహ్వానించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.
News March 6, 2025
నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చిన స్టాక్‌మార్కెట్లు

ఆరంభంలో నష్టపోయిన దేశీయ స్టాక్‌మార్కెట్లు మధ్యాహ్నం భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 22,440 (+111), సెన్సెక్స్ 73,991 (+280) వద్ద చలిస్తున్నాయి. ఉదయం ఈ సూచీలు అరశాతం మేర పతనమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. మెటల్, ఆయిల్ & గ్యాస్, కమోడిటీస్, ఎనర్జీ, ఫార్మా, హెల్త్‌కేర్, మీడియా షేర్లు దుమ్మురేపుతున్నాయి. NSEలో 2818 షేర్లు ట్రేడవ్వగా ఏకంగా 2255 పెరిగాయి.