News April 4, 2025
అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్న అన్నామలై?

తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి అన్నామలై రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తాను మరోసారి అధ్యక్ష పదవి రేసులో ఉండనని స్పష్టం చేయడంతో ఏ క్షణంలోనైనా అన్నామలై రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉంది. పార్టీలో ఎంతోమంది గొప్ప నేతలు ఉన్నారని, వారి నుంచే కొత్త నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని ఆయన తెలిపారు.
Similar News
News April 11, 2025
టీవీల్లోకి బ్లాక్ బస్టర్ సినిమా

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కు సిద్ధమైంది. ఈనెల 13, 14 తేదీల్లో దక్షిణాది భాషల్లో ప్రసారం కానుంది. ఈనెల 13న తెలుగులో స్టార్ మా (5.30pm), మలయాళంలో ఆసియా నెట్ (6.30pm), కన్నడలో కలర్స్ కన్నడ (7pm), 14న తమిళంలో స్టార్ విజయ్ (3pm) టీవీ ఛానల్లో రానుంది. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1800కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.
News April 11, 2025
గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యం కుదింపు

TG: యాదాద్రి(D) గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.28 TMCల నుంచి 1.41 TMCలకు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.575.56 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా అప్పటి BRS ప్రభుత్వం గంధమల్ల వద్ద 9.86 TMCలతో రిజర్వాయర్ నిర్మించాలనుకుంది. ముంపునకు గురయ్యే 5 గ్రామాల నుంచి వ్యతిరేకత రావడంతో 4.28 TMCలకు కుదించింది. తాజాగా INC సర్కార్ 1.41 TMCలకు పరిమితం చేసింది.
News April 11, 2025
జాతీయ స్థాయిలో అన్నామలై సేవలు: అమిత్షా

తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి కోసం ఒకే నామినేషన్ దాఖలైనట్లు కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అన్నామలై సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని తెలిపారు. ప్రధాని మోదీ విధానాలను గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లడంలో అన్నామలై భాగస్వామ్యం విలువైనవని పేర్కొన్నారు. కాగా ఒకే నామినేషన్ దాఖలు కావడంతో రేపు నైనార్ నాగేంద్రన్ను అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశముంది.