News March 18, 2024

అన్నమయ్య: గుండెపోటుతో ఏఎస్ఐ మృతి

image

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఎం.రెడ్డెప్పనాయక్ ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. పీటీఎం మండలం చండ్రాయునిపల్లి సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా గుండె నొప్పి వచ్చింది. వెంటనే సహచరులు ఏఎస్ఐని 108లో బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు మార్గమధ్యలోనే చనిపోయినట్లు నిర్ధారించారు. ఆయన మృతిపై పలువురు సంతాపం తెలిపారు.

Similar News

News April 1, 2025

సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట టీటీడీ పరిపాలన భవన సమావేశ మందిరంలో ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జేఈవో వీరబ్రహ్మంతో కలిసి బ్రహ్మోత్సవాలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై కలెక్టర్ సూచనలు చేశారు.

News March 31, 2025

అలా చేస్తే దక్షిణాదికి అన్యాయం: తులసి రెడ్డి

image

విజయవాడ బాలోత్సవ భవన్‌లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో కడప జిల్లాకు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు తులసి రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిని సరిదిద్దాలని కోరారు. సమావేశంలో సీపీఐ, సీపీఎం, జన చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News March 31, 2025

రంజాన్ సందర్భంగా కడప జిల్లాలో భారీ బందోబస్త్

image

కడప జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగ నేపథ్యంలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కడపలోని బిల్డప్ సర్కిల్ సమీపంలోనీ ఈద్గా వద్ద సోమవారం భద్రతను ఎస్పీ పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తగిన భద్రతను నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఆన్ ఈద్గాల వద్ద ప్రజలకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!