News March 25, 2025

MLAలు పార్టీ మారి వార్షికోత్సవం పూర్తైంది: సుప్రీం

image

TG: పార్టీ మారిన MLAల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రతివాదులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘MLAలు పార్టీ మారి ఇప్పటికే వార్షికోత్సవం పూర్తైంది. రీజనబుల్ టైమ్ అంటే వారి పదవీకాలం పూర్తయ్యేవరకా? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకపోతే పదో షెడ్యూల్‌ను అపహాస్యం చేసినట్లే. ఆలస్యం చేసే ఎత్తుగడలు వేయొద్దు. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలి’ అని ప్రభుత్వ తరఫు లాయర్‌ను ఆదేశించింది.

Similar News

News March 28, 2025

ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఏపీ ప్రొఫెసర్

image

APకి చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్, VSU వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాస రావు ప్రపంచ దిగ్గజ శాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రపంచంలోని టాప్ 2% శాస్త్రవేత్తలలో ఒకరిగా ఆయన నిలిచినట్లు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో వెల్లడైంది. భౌతిక శాస్త్ర రంగానికి ఆయన చేసిన కృషికి దక్కిన ఫలితం ఇది. ఆయన వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌కు 250కి పైగా శాస్త్రీయ వ్యాసాలు రాసి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు.

News March 28, 2025

ఓటీటీలోకి వచ్చేసిన 4 కొత్త సినిమాలు

image

ఇవాళ నాలుగు కొత్త మూవీలు OTTల్లో రిలీజయ్యాయి. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, రీతూ వర్మ కాంబోలో తెరకెక్కిన ‘మజాకా’ సినిమా నేటి నుంచి ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. షాహిద్ కపూర్, పూజా హెగ్డే కాంబోలో తెరకెక్కిన ‘దేవ’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. ఆది పినిశెట్టి హీరోగా నటించిన ‘శబ్దం’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది. తమిళ నటుడు జీవా నటించిన ‘అగత్యా’ సన్ నెక్ట్స్‌లో విడుదలైంది.

News March 28, 2025

వక్ఫ్ బోర్డును నాశనం చేసేందుకే సవరణ బిల్లు: అసదుద్దీన్

image

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ‘మతపరమైన అంశాల్లో ముస్లింల పాత్ర లేకుండా చేసేందుకు, వక్ఫ్ బోర్డును సమూలంగా నాశనం చేసేందుకు కేంద్రం వక్ఫ్ బిల్లులో సవరణలు తీసుకొస్తోంది. ఒక్క ముస్లిం MP, మంత్రి లేని ఈ ప్రభుత్వాన్ని మేం ఎలా నమ్మగలం? ముస్లింలకు టికెట్లు కూడా ఇవ్వరు. పైగా బుల్డోజర్లతో ఇళ్లు కూలగొడుతుంటారు’ అని విమర్శించారు.

error: Content is protected !!