News March 19, 2024
కాపులకు మేలు చేసే హామీలు ప్రకటించండి: హరిరామ జోగయ్య

AP: కాపు ఉద్యమ నేత హరిరామజోగయ్య మరో లేఖ విడుదల చేశారు. టీడీపీ-జనసేన- బీజేపీ విడుదల చేసే మేనిఫెస్టోలో కాపులకు మేలు చేసే హామీలు ఉంటాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు 10 హామీలతో కూడిన బీసీ డిక్లరేషన్ ప్రకటించడం ఆహ్వానించదగినదే అని అన్నారు. అలాగే జనాభాలో 20 శాతం ఉన్న కాపులకు కూడా బీసీలకు చెప్పిన విధంగానే హామీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Similar News
News August 28, 2025
నేడు జపాన్ పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఇవాళ అర్ధరాత్రి జపాన్‌కు బయలుదేరనున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో అక్కడ పర్యటించి 15వ ఇండియా-జపాన్ యాన్యువల్ సమ్మిట్‌లో పాల్గొంటారు. జపనీస్ PM ఇషిబాతో సమావేశమై ఇరు దేశాల దౌత్య, ట్రేడ్ సంబంధాలపై చర్చిస్తారు. 2018 తర్వాత మోదీ జపాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. 2014లో ఆయన PMగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు జపాన్‌లో పర్యటించారు.
News August 28, 2025
బిజినెస్‌మెన్‌ను పెళ్లాడనున్న హీరోయిన్!

హీరోయిన్ నివేదా పేతురాజ్ పెళ్లి పీటలెక్కనున్నారు. బిజినెస్మెన్ రాజ్‌హిత్ ఇబ్రాన్ను ఆమె వివాహం చేసుకోనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ జోడీ కలిసి దిగిన ఫొటోలను SMలో షేర్ చేశాయి. ఈ ఏడాదిలోనే అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనున్నట్లు వెల్లడించాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని పేర్కొన్నాయి. నివేదా తెలుగులో మెంటల్ మదిలో, అల వైకుంఠపురంలో, పాగల్ తదితర చిత్రాల్లో నటించారు.
News August 28, 2025
మెగా డీఎస్సీ.. నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

AP: డీఎస్సీ అభ్యర్థులకు ఇవాళ ఉ.9 గంటల నుంచి <<17519055>>సర్టిఫికెట్<<>> వెరిఫికేషన్ ప్రారంభం కానున్నట్లు కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. కాల్ లెటర్లు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. అభ్యర్థులు సర్టిఫికెట్లను సైట్లో అప్లోడ్ చేసి, తమకు కేటాయించిన తేదీ, సమయం, వేదికలో CVకి హాజరుకావాలని సూచించారు. వెరిఫికేషన్ పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. హాజరు కాని, అర్హత లేని వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తామని పేర్కొన్నారు.