News April 4, 2025

38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన

image

AP: రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పంపకం కొనసాగుతోంది. ఇటీవల 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించగా, ఇవాళ మరో 38 కమిటీలకు ప్రభుత్వం నియామకాలు చేసింది. ఇందులో 31 టీడీపీకి, 6 జనసేనకు, ఒకటి బీజేపీకి దక్కింది. త్వరలోనే మిగతా కమిటీలకు ఛైర్మన్లను ప్రకటిస్తామని టీడీపీ వెల్లడించింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా 218 మార్కెట్ కమిటీలున్నాయి.

Similar News

News April 11, 2025

రోజంతా నగ్నంగా పాప్ సింగర్

image

హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ బీచ్‌లో రోజంతా నగ్నంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో తెలియజేశారు. ఎండవేడికి ఆమె చర్మం ప్రభావితమైనట్లు ఫొటోలో తెలుస్తోంది. కాగా గత ఏడాది స్వీయ వివాహం చేసుకొని ఈ బ్యూటీ వార్తల్లో నిలిచారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న బ్రిట్నీ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు.

News April 11, 2025

జైలులో CBN చేసినవి డ్రామాలు: పేర్ని నాని

image

AP: భద్రత విషయంలో వైసీపీ చీఫ్ జగన్‌కు డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. డ్రామాలంటే జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు చేసినవని కౌంటరిచ్చారు. వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే జగన్‌పై విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. భద్రత కల్పించడంలో విఫలమైన కూటమి నేతలు దిగజారిపోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సినీ ప్రముఖుల కంటే ఎక్కువ క్రేజ్ జగన్ సొంతమని చెప్పారు.

News April 11, 2025

2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం: మోదీ

image

2036 ఒలింపిక్స్‌ భారత్‌లో జరిగేలా ప్రయత్నం చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో విశ్వక్రీడలు నిర్వహిస్తే భారత్‌ ఖ్యాతి పెరుగుతుందని ఆకాంక్షించారు. ఒలింపిక్స్‌లో పాల్గొనేలా వారణాసి యువత నేటి నుంచే శిక్షణ ప్రారంభించాలని కోరారు. గతంతో పోల్చితే కాశీ చాలా అభివృద్ధి చెందిందని, హెల్త్ క్యాపిటల్‌గా మారిందన్నారు. వారణాసిలో పలు అభివృద్ధి పనులకు నేడు మోదీ శంకుస్థాపన చేశారు.

error: Content is protected !!