News September 4, 2025
బెస్ట్ లెక్చరర్స్‌కు అవార్డుల ప్రకటన

TG: యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో విశేష సేవలందించిన అధ్యాపకులకు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. OU నుంచి నలుగురు, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, చాకలి ఐలమ్మ, అంబేడ్కర్ ఓపెన్, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ప్రొ.జయశంకర్ వర్సిటీల్లో ఒక్కొక్క లెక్చరర్‌ను, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ వర్సిటీలో ఇద్దరిని బెస్ట్ లెక్చరర్స్‌గా ఎంపిక చేసింది. లిస్ట్ కోసం ఇక్కడ <
Similar News
News September 4, 2025
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దైంది. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 6న హైదరాబాద్‌లో జరిగే గణేశ్ శోభాయాత్రలో ఆయన పాల్గొనాల్సి ఉండగా, పర్యటన రద్దైంది.
News September 4, 2025
వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్దాం: మోదీ

దేశ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారుతాయని PM మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. స్వదేశీ వస్తు వినియోగం, మేడిన్ ఇండియాను విద్యార్థి దశలోనే నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. ‘వోకల్ ఫర్ లోకల్ నినాదం మరింత ముందుకు తీసుకెళ్లాలి. దేశీయ ఉత్పత్తులు వాడుతున్నామని అందరూ గర్వపడాలి. గాంధీజీ నినాదం కూడా స్వదేశీ.. దాన్ని అందరం పాటించాలి. స్వదేశీ డే, స్వదేశీ వీక్‌ను పండుగగా నిర్వహించుకోవాలి’ అని పిలుపునిచ్చారు.
News September 4, 2025
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్మానీ కన్నుమూత

ప్రపంచ ప్రఖ్యాత, ఇటలీ లెజెండరీ ఫ్యాషన్ డిజైనర్ అర్మానీ(91) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు ఫ్యాషన్ హౌస్ కంపెనీ తెలిపింది. కింగ్ జార్జియోగా పేరొందిన అర్మానీ మోడర్న్ ఇటాలియన్ స్టైల్‌తో పేరొందారు. ఆయన కంపెనీ ఏటా 2.3 బిలియన్ యూరోల ఆదాయం ఆర్జిస్తోంది. అర్మానీ అంత్యక్రియలు ఈ నెల 6 లేదా 7న నిర్వహించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అర్మానీ బ్రాండ్ వస్త్ర ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది.