News March 21, 2024
నేడు ఆ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!

TG: కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ఇంకా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించగా, ఇవాళ మరో ఆరుగురు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇందులో పెద్దపల్లి, చేవెళ్ల, సికింద్రాబాద్, ఆదిలాబాద్, మల్కాజిగిరి, నాగర్కర్నూల్ ఉన్నాయి. ఖమ్మం, WGL, కరీంనగర్, NZB, భువనగిరి, మెదక్, HYD అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. వీటిపై మరో 2 రోజుల్లో స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News September 10, 2025
రామరాజ్యం లాంటి పాలన ఇస్తాం: CM

AP: రాష్ట్ర ప్రజలకు రామరాజ్యం లాంటి పాలన అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘నేను, పవన్ కళ్యాణ్, మాధవ్ కలిసి సుపరిపాలన అందిస్తాం. నేను నాలుగో సారి సీఎంను. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్. ఎమ్మెల్యేలందరూ కామన్ మ్యాన్లాగే ఉండాలి. దర్జాలు, ఆర్భాటాలు పనికిరావు. ఎవరూ అహంకారాన్ని ప్రదర్శించవద్దు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టే పనులు వేగంగా అవుతున్నాయి’ అని అనంతపురంలో వివరించారు.
News September 10, 2025
సూపర్-6 అట్టర్ ఫ్లాప్: వైసీపీ

AP: దీపం పథకం కింద ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమంటూ ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైసీపీ విమర్శించింది. మొదటి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చి మమ అనిపించిందని, మిగతావి ఇప్పటి వరకు అతీగతీ లేవని దుయ్యబట్టింది. ఇప్పుడు ఆ పథకం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదని ఎద్దేవా చేసింది. ప్రజలను మోసగించి విజయోత్సవాలు చేసుకునేందుకు సిగ్గుండాలని మండిపడింది.
News September 10, 2025
వారసుడితో నాగబాబు ఫ్యామిలీ

వరుణ్-లావణ్య జోడీ మగబిడ్డకు జన్మనివ్వడంతో నాగబాబు కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. మనవడి రాకతో తమ కుటుంబ భవిష్యత్తుకు సరికొత్త కాంతి వచ్చిందని నాగబాబు ట్వీట్ చేశారు. ‘సింహం కూనకు స్వాగతం. నీవు నా హృదయంలో గర్జించావు. నీ చేతిని పట్టుకొని నడిచేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని రాసుకొచ్చారు. కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు.