News March 29, 2024
నేడు జనసేన అభ్యర్థుల ప్రకటన?

అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అసెంబ్లీ స్థానాలు, బందరు ఎంపీ సీటుకు అభ్యర్థుల్ని జనసేన అనౌన్స్ చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై 4 రోజుల నుంచి పవన్ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా సీట్ల ఆశావహులు ఆయనతో పార్టీ కార్యాయలంలో భేటీ అయ్యారు. నేడు మరోసారి పార్టీ కార్యవర్గంతో చర్చించిన అనంతరం జనసేనాని జాబితా అనౌన్స్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News March 31, 2026
సెక్స్ కోసం భార్యను బలవంతం చేయడం రేపే: చిన్మయి

‘చిరైయా’ సిరీస్‌లో భార్యకు ఇష్టం లేకుండా భర్త శృంగారం చేసే సీన్‌పై సింగర్ చిన్మయి ఘాటుగా స్పందించారు. ‘పెళ్లయినంత మాత్రాన ఎదుటివారికి ఇష్టం లేకపోయినా ముహూర్తం పేరుతో శృంగారానికి బలవంతం చేయడం తప్పు. ఇది రేప్ కిందకే వస్తుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో భర్త గురించి తెలుసుకునే సమయం కూడా దొరకదు’ అని Xలో రాసుకొచ్చారు. దంపతుల మధ్య గౌరవం, ఇష్టం ఉన్నప్పుడే ఆ బంధం కలకాలం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
News March 31, 2026
IPL బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ మృతి

ENGకు చెందిన IPL బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ జాన్ విలియమ్(76) మరణించారు. ఈ నెల 29న MI-KKR మ్యాచ్ తర్వాత హోటల్‌కు వెళ్లారు. మరుసటి రోజు కాల్ చేసినా స్పందించకపోవడంతో సిబ్బంది మాస్టర్ కీతో డోర్ తెరిచి చూడగా జాన్ నేలపై పడిఉన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టంలో అనుమానాస్పదంగా ఏమీ లేనప్పటికీ అసహజ మరణంగానే కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.
News March 31, 2026
మలయాళ డైరెక్టర్‌తో ఐకాన్ స్టార్ 25వ చిత్రం?

అల్లు అర్జున్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో ‘AA22’ తెరకెక్కుతుండగా, ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్, త్రివిక్రమ్ చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ప్రతిష్ఠాత్మక 25వ చిత్రానికి మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ డైరెక్షన్ చేయనున్నట్లు సమాచారం. దీన్ని ‘గీతా ఆర్ట్స్’ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనుందని తెలుస్తోంది. కేరళలో ఐకాన్ స్టార్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.


