News October 15, 2024

నేడు మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల తేదీల ప్రకటన

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఇవాళ మ.3.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ నిర్వహించి రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది.

Similar News

News November 17, 2025

తేజస్‌ను నడిపిన తొలి మహిళా ఫైటర్ పైలెట్

image

దేశీయ యుద్ధ విమానం తేజస్‌ ఫైటర్‌ జెట్‌ స్క్వాడ్రన్‌ నిర్వహించే ఎలైట్‌ 18 ఫ్లయింగ్‌ బులెట్స్‌ స్క్వాడ్రన్‌లో తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌గా రికార్డులకెక్కారు. భారతవైమానికదళంలోని ముగ్గురు మహిళా పైలట్లలో స్క్వాడ్రన్‌ లీడర్‌ మోహనాసింగ్‌ ఒకరు. జెట్‌ ఫైటర్‌గా రాణించాలంటే యుద్ధ సమయంలో పాటించాల్సిన వ్యూహాలతో పాటు, యుక్తులు ప్రదర్శించగలగాలి. ఈ శిక్షణలో నెగ్గితేనే యుద్ధ విమానాన్ని నడిపేందుకు అర్హత సాధిస్తారు.

News November 17, 2025

ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం.. నేడు ఏం జరగనుంది?

image

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. స్పీకర్‌పై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌తో పాటు 10 మంది MLAలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌ను ధర్మాసనం నేడు విచారించనుంది. MLAలను విచారించేందుకు స్పీకర్‌కు మరింత సమయం ఇస్తారా? లేదా తుది నిర్ణయం తీసుకుంటారా? ఈ నెల 23న సీజేఐ గవాయ్ రిటైర్ కానున్న నేపథ్యంలో విచారణను మరో బెంచ్‌కు పంపిస్తారా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.

News November 17, 2025

గంభీర్ వల్లే ఓడిపోయాం.. నెటిజన్ల ఫైర్

image

నిన్న సౌతాఫ్రికా చేతిలో టీమ్ ఇండియా ఓటమికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తప్పులే కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో పదేపదే ఎందుకు మార్పులు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. స్పెషలిస్టు బ్యాటర్ సాయి సుదర్శన్‌ను ఆడించకుండా నలుగురు స్పిన్నర్లు ఎందుకని నిలదీస్తున్నారు. గతేడాది NZతో వైట్‌వాష్ అయినా పాఠాలు నేర్వకుండా మళ్లీ స్పిన్ పిచ్‌లే ఎందుకు తయారుచేశారని ప్రశ్నిస్తున్నారు.