News July 1, 2024

MLC అభ్యర్థుల ప్రకటన

image

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే కూటమి అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. టీడీపీ నేత సి.రామచంద్రయ్య, జనసేన నేత పిడుగు హరిప్రసాద్ పేర్లు ఫిక్స్ అయ్యాయి. వీరిద్దరూ రేపు నామినేషన్ వేయనున్నారు.

Similar News

News January 21, 2026

వంటింటి చిట్కాలు మీకోసం

image

☛ బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మరసం చల్లితే జిగురు ఉండదు.
☛ సాంబార్‌లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళదుంప ముక్కలు లేదా శనగ పిండిలో కొద్దిగా నీరు కలిపి దాంట్లో యాడ్ చేయాలి.
☛ పాత్రల్లో నీచు వాసన పోవాలంటే వాటిలో ఉప్పు వేసి కాసేపటి తర్వాత కడిగితే సరిపోతుంది.
☛ పాస్తా ఉడికించినప్పుడు ముద్దలా అవ్వకుండా ఉండాలంటే వాటిని ఉడికించే గిన్నెలో ఓ చెక్క స్పూన్ కానీ ఫోర్క్ కానీ వెయ్యాలి.

News January 21, 2026

ఇన్వెస్టర్లకు కాసుల వర్షం.. 10gలపై రూ.73వేలు లాభం!

image

ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ఇన్వెస్టర్లకు భారీగా లాభాలొచ్చాయి. సరిగ్గా ఏడాది క్రితం రూ.81,230 ఉన్న 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం నేడు రూ.1,54,800కు చేరి రూ.73,570 లాభాన్ని పంచింది. అలాగే ఈ 3 రోజుల్లోనే రూ.11,020 పెరిగింది. అటు KG వెండి ధర రూ.1,04,000 నుంచి మూడు రెట్లు పెరిగి రూ.3,40,000కు చేరుకుంది. ఈ భారీ లాభాలతో పసిడి, వెండిపై ఇన్వెస్టర్లకు మరింత నమ్మకం ఏర్పడింది.

News January 21, 2026

విజయ్-రష్మిక పెళ్లికి డచ్ గులాబీలు!

image

విజయ్-రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. విజయ్-రష్మికకు విషెస్ చెబుతూ వారి పెళ్లికి తమ తరఫున అత్యంత నాణ్యమైన డచ్ గులాబీలు పంపనున్నట్లు చెప్పారు. ఈ ఫ్లవర్స్ వారి వేడుకను మరింత అందంగా మారుస్తాయని ఆకాంక్షించారు. ఇప్పటివరకు పెళ్లిపై రష్మిక, విజయ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.