News January 2, 2025
రాజ్యాంగ మార్పు ప్రకటనలు మానుకోవాలి: అసదుద్దీన్

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాలని MIM అధినేత అసదుద్దీన్ కోరారు. రాజ్యాంగాన్ని మారుస్తామంటూ చేస్తున్న ప్రకటనల్ని మానుకోవాలని అవి ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ‘రాజ్యాంగంలో మార్పులు తెస్తే ప్రతిపక్షాల ఆమోదం కచ్చితంగా ఉండాలి. ప్రార్థనా స్థలాల్ని మార్చడాన్ని 1991 చట్టం ఒప్పుకోదు. స్వాతంత్ర్యం తర్వాతి నుంచి ఉన్న ఏ ప్రార్థనా స్థలమైనా యథాతథంగా కొనసాగాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News December 31, 2025
వింటర్‌లో రాత్రుళ్లు చెమటలా? షుగర్ ముప్పు!

చలికాలంలో కూడా రాత్రుళ్లు చెమటలు పడుతుంటే నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. షుగర్ వచ్చిందనడానికి అది సంకేతం కావొచ్చని చెబుతున్నారు. ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళుతుండడం, నిద్రపోతున్న సమయంలో చేతులు, కాళ్లు జలదరిస్తాయి. అయితే, విటమిన్ B12, నరాల బలహీనత ఉన్నా ఆ సమస్య రావొచ్చని గుర్తుంచుకోండి. షుగర్‌ను నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాల సమస్య, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
News December 31, 2025
మోడర్న్ వెపన్స్ కొనుగోలుకు రూ.4,666కోట్ల ఒప్పందాలు

రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. తాజాగా రూ.4,666Crతో క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్స్, హెవీ వెయిట్ టార్పడోస్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు భారత్ ఫోర్జ్ లిమిటెడ్, PLR సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. 2030 నాటికి ఇవి డిఫెన్స్‌కు అందనున్నాయి. కాగా 2025-26 వార్షిక ఏడాదిలో రక్షణ రంగానికి కేంద్రం రూ.1,82,492 కోట్లను కేటాయించింది.
News December 30, 2025
భారత్ విజయం.. సిరీస్ క్లీన్‌స్వీస్

శ్రీలంక ఉమెన్స్ టీమ్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌ను భారత అమ్మాయిలు వైట్‌వాష్ చేశారు. తాజాగా చివరి టీ20లోనూ అదరగొట్టి 15 రన్స్ తేడాతో విజయం సాధించారు. 176 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన లంక 160/7 పరుగులకే పరిమితమైంది. భారత జట్టులో దీప్తి, అరుంధతి, స్నేహ్ రాణా, వైష్ణవి, శ్రీచరణి, అమన్‌జోత్ తలో వికెట్ తీశారు.


