News July 23, 2024
ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరో 163 రకాల వ్యాధులు
TG: రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా మరో 163వ్యాధుల చికిత్సలను చేర్చింది. ఇందులో మోకాలి ఆపరేషన్, ఫిస్టులా, రేడియాలజీ చికిత్సలు, థైరాయిడ్ క్యాన్సర్కు సంబంధించిన 7 చికిత్సలు, క్రానిక్ థ్రాంబో ఎంబాలిక్ పల్మనరీ హైపర్ టెన్షన్, వీనో ఆర్టీరియల్ ఎక్స్ట్రా కార్పోరల్ మెంబ్రేన్ ఆక్సిజినేషన్, ఇండక్షన్ ఆఫ్ ఫెర్టిలిటీతో పాటు మరికొన్ని చికిత్సలను అదనంగా చేర్చింది. ప్యాకేజీల <<13684511>>ధరలు<<>> పెంచింది.
Similar News
News January 28, 2025
టెన్త్ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్
AP: పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెలవుల్లోనూ వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు విద్యార్థులకు భోజనం అందించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు రెండు రెండో శనివారాలు, ఆరు ఆదివారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో విద్యార్థులకు భోజనం అందించాలని ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి.
News January 28, 2025
BJPలోకి అంబటి రాయుడు?
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుుడు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఏబీవీపీ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఆ సదస్సులో ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ ఒక్కటేనని ఆకాశానికెత్తారు. అప్పటి నుంచి ఆయన కాషాయ పార్టీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. కాగా రాయుడు గతంలో వైసీపీలో చేరారు. అనంతరం ఆ పార్టీని వీడి జనసేన పార్టీతో కనిపించారు.
News January 28, 2025
IND vs ENG: మనోళ్లు సిరీస్ పట్టేస్తారా?
భారత్, ఇంగ్లండ్ మధ్య ఇవాళ మూడో టీ20 జరగనుంది. రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా 5 మ్యాచుల సిరీస్లో టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తూ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన భావిస్తోంది. మరోవైపు ఇవాళ గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచులో టాస్ కీలకంగా మారనుంది.