News April 19, 2024

మరో 25 ఏళ్లు వైసీపీదే అధికారం: జోగి

image

AP: రాష్ట్రంలో మరో 25 ఏళ్లపాటు వైసీపీదే అధికారం అని మంత్రి జోగి రమేశ్ అభిప్రాయపడ్డారు. ‘అన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. మళ్లీ వైసీపీదే అధికారం. చంద్రబాబు సీఎం కావాలని అనుకోవడం లేదు. ఎమ్మెల్యే అయితే చాలని భావిస్తున్నారు. పవన్ కూడా అదే భావనలో ఉన్నారు. సీఎం జగన్ చేపట్టిన బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. ఈ నెల 25న మా పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 15, 2025

గ్రామాల్లో మహిళా ఓటర్లే అత్యధికం: ఈసీ

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో గ్రామీణ జనాభా 1.95 కోట్లకు గానూ ఓటర్లు 1,67,03,168 మంది ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు 5,763 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితాలను వెల్లడించింది. వీరిలో మహిళా ఓటర్లు 85,35,935 మంది కాగా పురుషులు 81,66,732 మంది ఉన్నారని తెలిపింది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 లక్షలకుపైగా ఎక్కువని పేర్కొంది.

News September 15, 2025

దారుణం.. నిద్రిస్తున్న విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్

image

ఒడిశాలో ఓ హాస్టల్‌ విద్యార్థి చేసిన తుంటరి పని తోటి విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చింది. కంధమాల్ జిల్లా సలాగూడలోని సెబాశ్రమ్ స్కూల్ హాస్టల్‌లో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో ఓ స్టూడెంట్ ఫెవిక్విక్ వేశాడు. ఈ ఘటనతో వారి కళ్లు మూసుకుపోయాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకరికి కళ్లు పూర్తిగా తెరుచుకోగా మిగతావారికి అలాగే ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 15, 2025

CSIRలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

image

<>CSIR <<>>అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్‌‌స్టిట్యూట్ 8 JRF, SRF, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, ఎంఫిల్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 18వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి 45ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.csir.res.in/