News July 26, 2024

బీటెక్‌లో మరో 9వేల సీట్లు

image

TG: రాష్ట్రంలో కొత్తగా మరో 9,000 బీటెక్ సీట్ల కల్పనకు కసరత్తు పూర్తయింది. ఇవి నేడో, రేపో అందుబాటులోకి రానున్నాయి. బీటెక్‌లో ప్రవేశాలకు నేటి నుంచి రెండో విడత కౌన్సెలింగ్ మొదలవుతుంది. 27, 28 తేదీల్లో వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది. కాగా ఈ రెండు రోజుల్లోనే విద్యాశాఖ నుంచి కొత్త సీట్లపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Similar News

News November 10, 2025

‘లిట్టర్’ నిర్వహణ.. కోళ్ల ఫారాల్లో ముఖ్యం

image

కోళ్ల ఫారాలలో నేలపై ఎండు గడ్డి, చెక్క పొట్టు, లేదా ఇతర సేంద్రియ పదార్థాల రూపంలో లిట్టర్ ఉంటుంది. దీన్ని కోళ్ల ఫారాలలో పరుపుగా ఉపయోగిస్తారు. ఇది కేవలం కోళ్ల పడక పదార్థమే కాదు. కోళ్ల మల విసర్జనలోని తేమను పీల్చి పొడిగా ఉంచుతుంది. ఫారాల్లో దుర్వాసనను తగ్గిస్తుంది. కోళ్లకు సౌకర్యంగా ఉండేట్లు చేసి.. వ్యాధికారక క్రిములు పెరగకుండా చేస్తుంది. లిట్టర్ నిర్వహణ సరిగాలేకుంటే వ్యాధుల ఉద్ధృతి పెరుగుతుంది.

News November 10, 2025

JIO యూజర్స్ BSNL నెట్‌వర్క్ వాడుకోవచ్చు!

image

జియో 28 డేస్ వ్యాలిడిటీతో రెండు కొత్త(రూ.196, రూ.396) రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చింది. వీటితో రీఛార్జ్ చేసుకుంటే మారుమూల ప్రాంతాల్లో జియో సిగ్నల్ లేనప్పుడు BSNL నెట్‌వర్క్ వాడుకోవచ్చు. వీటిని ఇంట్రా-సర్కిల్ రోమింగ్(ICR) ప్లాన్స్ అంటారు. ప్రస్తుతం ఇవి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అందుబాటులో ఉన్నాయి. రీఛార్జ్ చేశాక ఎప్పుడైతే BSNL నెట్‌వర్క్ ఫస్ట్ వాడతారో అప్పుడే ప్లాన్ యాక్టివేట్ అవుతుంది.

News November 10, 2025

వాళ్లు మూల్యం చెల్లించాల్సిందే: లోకేశ్

image

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ‘సిట్’ నిజాన్ని బట్టబయలు చేసిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ‘కల్తీ నెయ్యి కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు. ఇది కల్తీ కాదు.. హిందువుల నమ్మకం, భారత దేశ ఆత్మవిశ్వాసంపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వాళ్లు తప్పక మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఓం నమో వేంకటేశాయ’ అని ట్వీట్ చేశారు.