News April 23, 2025

మద్యం కుంభకోణంలో మరో నిందితుడు అరెస్ట్

image

AP: మద్యం కుంభకోణం వ్యవహారంలో పోలీసులు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ స్కామ్‌కు సంబంధించి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ కాగా, తాజాగా A8 చాణక్యను అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన అతడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, రాజ్ కసిరెడ్డి విచారణలో పూర్తి వివరాలు వెల్లడించలేదని సిట్ అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News April 24, 2025

పాక్‌పై సానుభూతి చూపేదిలేదు: కిషన్‌రెడ్డి

image

దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉగ్రదాడి వెనకున్న పాక్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం మంచి పరిణామమన్నారు. ఆ దేశంపై సానుభూతి చూపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు దౌత్యపరమైన సమాధానమే ఇచ్చామని, త్వరలో మిలటరీ పరంగానూ ఆన్సర్ ఉంటుందని తెలిపారు. ఉగ్రదాడిలో పోయిన ప్రతి ప్రాణానికి ప్రతీకారం తప్పదనే సంకేతాలు కేంద్రం ఇచ్చిందన్నారు.

News April 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 24, 2025

గ్రాండ్ ప్రి చెస్ టోర్నీ విజేతగా కోనేరు హంపి

image

పుణె వేదికగా జరిగిన ఫిడే మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నీలో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి విజేతగా నిలిచారు. ఫైనల్ రౌండులో బల్గేరియాకు చెందిన నుర్గుయిల్‌పై 1-0 తేడాతో విజయం సాధించారు. తుదిపోరు ముగిసే సమయానికి జు జినర్(చైనా)తో కలిసి ఆమె టాప్‌లో ఉన్నారు. అయితే టై బ్రేక్ ఆధారంగా హంపిని విజేతగా నిర్ధారించారు. మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక తన గేమ్‌ను డ్రాగా ముగించారు.

error: Content is protected !!