News April 12, 2025

ప్రజా ప్రభుత్వంలో మరో ఘనత: రేవంత్

image

TG: కాంగ్రెస్ హయాంలో తెలంగాణ దేశంలోనే అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా నిలిచిందని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వ విధానాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. BRS హయాంలో ద్రవ్యోల్బణం అధికంగా నమోదైందని తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే సిలిండర్, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, సన్నబియ్యం రేషన్ వంటి సాహసోపేతమైన నిర్ణయాలతో మార్పు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

Similar News

News January 23, 2026

ఎద్దు ఎండకులాగ, దున్న నీడకు లాగ

image

ఎద్దు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని ఎండలో కూడా పని చేస్తుంది. ఇది కష్టపడే తత్వానికి నిదర్శనం. దున్నపోతుకు కాస్త ఎండ తగిలినా భరించలేదు, అది ఎప్పుడూ నీడ కోసం లేదా నీళ్ల కోసం(చల్లదనం కోసం) వెతుకుతుంది. ఇది సుఖాన్ని కోరుకునే తత్వానికి నిదర్శనం. ఒకే ఇంట్లో లేదా ఒకే చోట ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటే, మరొకరు సోమరిగా ఉంటూ సుఖాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ సామెత వాడతారు.

News January 23, 2026

వసంత పంచమి రోజు పఠించాల్సిన మంత్రాలివే..

image

చదువుల తల్లి ఆశీస్సుల కోసం ఈరోజు ‘సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం’ పఠించడం అత్యంత ఫలప్రదం. విద్యార్థులు ‘సరస్వతి నమస్తుభ్యం’ శ్లోకాన్ని 108 సార్లు జపించాలి. మేధాశక్తి పెరగడానికి ‘ఓం హ్రీం ఐం సరస్వత్యై నమః’ అనే బీజాక్షర మంత్రాన్ని ధ్యానించాలి. గ్రహ దోషాలు, బుధ గ్రహ దోషం ఉన్నవారు సరస్వతీ కవచం పఠించడం వల్ల వాక్చాతుర్యం లభిస్తుంది. భక్తితో ఈ మంత్రాలను స్మరిస్తే ఏకాగ్రత పెరిగి పరీక్షల్లో విజయం లభిస్తుంది.

News January 23, 2026

వసంత పంచమి వేడుకలు ఎలా చేసుకోవాలంటే..

image

వసంత పంచమి వేడుకల్లో పసుపు రంగుకు ప్రాధాన్యం ఎక్కువ. ప్రజలు తెల్లవారునే లేచి, పసుపు రంగు దుస్తులు ధరించి సరస్వతీ పూజ చేస్తారు. పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టి పంచుకుంటారు. కొందరు శివపార్వతులను పూజిస్తారు. మరికొందరు సూర్య నమస్కారాలు చేస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విందులు ఆరగిస్తూ, పాటలతో, నృత్యాలతో ఈ వసంత ఆగమనాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.