News July 27, 2024

మరో ఘనత సాధించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్

image

AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉక్కు ఉత్పత్తి 100 మిలియన్ టన్నులకు చేరింది. ఈ పరిశ్రమలో 1990 నవంబర్‌లో ఉత్పత్తిని ప్రారంభించారు. నేటికి 100M టన్నుల మైలురాయిని చేరుకున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ ఏడాది 7.2M టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకోగా, ముడి సరకు కొరత వల్ల 2, 3 బ్లాస్ట్ ఫర్నేస్‌లు మాత్రమే పనిచేస్తున్నాయని కార్మికులు చెబుతున్నారు.

Similar News

News November 5, 2025

NEET-SS దరఖాస్తులు ప్రారంభం

image

NEET-SS దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. DM/MCh, DrNB తదితర సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఈ నెల 25 వరకు NBEMS వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 26, 27 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 22న అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి. ఫలితాలను 2026 జనవరి 28 లోపు వెల్లడిస్తారు. పీజీ చేసిన వారు(MD/MS/DNB) దరఖాస్తుకు అర్హులు.

News November 5, 2025

ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

image

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా మరికల్ అడవుల్లో పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

News November 5, 2025

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

image

AP: అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పుట్లూరు నుంచి వెళ్తున్న బస్సు చింతకుంట వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. స్టీరింగ్ స్టక్ కావడంతో ఇలా జరిగినట్లు సమాచారం. బస్సులో ఎక్కువగా ఆదర్శ పాఠశాల, జడ్పీ పాఠశాల విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.