News July 18, 2024

మరో దారుణం.. 8 ఏళ్ల బాలికపై హత్యాచారం

image

APలో చిన్నారులపై లైంగిక దాడులు ఆగడంలేదు. <<13600394>>నంద్యాల<<>>, <<13625931>>విజయనగరం<<>> ఘటనలు మరవకముందే తిరుపతి(D)లో 8 ఏళ్ల బాలికను ఓ మానవమృగం చిదిమేసింది. బిహార్‌కు చెందిన దంపతులు దొరవారిసత్రంలోని ఓ రైస్ మిల్లులో పనిచేసేందుకు వచ్చారు. వారి కూతురును అదే మిల్లులో పనిచేస్తున్న బిహార్ వాసి దిలీప్(22) బిస్కెట్ల ఆశ చూపి అడవిలోకి తీసుకెళ్లాడు. చిన్నారిని రేప్ చేసి చంపేశాడు.

Similar News

News December 1, 2025

‘108’ సంఖ్య విశిష్టత

image

ధర్మశాస్త్రాల ప్రకారం.. మానవుడి శరీరంలో 108 ముఖ్యమైన నరాలు, మెదడులో 108 శక్తి కేంద్రాలు ఉన్నాయని చెబుతారు. వీటన్నింటినీ ఉత్తేజితం చేయడానికి ఓ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలని సూచిస్తారు. ఇలా చేస్తే మంత్రంలోని శక్తి ఈ కేంద్రాలన్నింటికీ ప్రసరించి, సంపూర్ణ ఆధ్యాత్మిక ఫలం వస్తుందని నమ్మకం. పగడాల మాలతో జపం చేస్తే.. వేయింతల ఫలం, రత్నమాలతో చేస్తే పదివేల రెట్ల ఫలం వస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి.

News December 1, 2025

SBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

SBIలో 15 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. వీటిలో 5 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, 10 మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈ పోస్టులకు వేర్వేరుగా అప్లై చేసుకోవాలి. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ , బీఈ, బీటెక్, MBA/MS/PGDBM/PGDBA ఫైనాన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in

News December 1, 2025

పంచాయతీలో ‘నోటా’.. మెజార్టీ ఓట్లు వచ్చినా?

image

TG: పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటా(నన్ ఆఫ్ ది ఎబౌ)ను ప్రవేశపెట్టారు. అయితే నిబంధనల ప్రకారం అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా ఎలక్షన్‌ను ఎన్నికల సంఘం రద్దు చేయదు. తర్వాతి స్థానంలో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తుంది. నోటా అనేది కేవలం ఓటరుకు నిరసన తెలిపే హక్కుగానే పరిగణిస్తుంది. ఇప్పటికే పార్లమెంటు, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈ విధానం ఉంది.