News April 1, 2025
‘దేవర’ సినిమాకు మరో అవార్డు

ఉగాది’ సందర్భంగా చెన్నైలో శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ ఇచ్చిన అవార్డుల్లో దేవరను బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు వరించింది. ఈ విషయాన్ని దేవర ఫొటోగ్రఫీ డైరెక్టర్ రత్నవేలు ట్వీట్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా భారీ విజయాన్ని అందుకోగా ఇటీవలే జపాన్‌లో రిలీజైన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ నటిస్తోన్న ‘పెద్ది’ సినిమాకు DOPగా పనిచేస్తున్నారు.
Similar News
News February 5, 2026
WPL ఫైనల్: టాస్ గెలిచిన RCB

WPL ఫైనల్ 2026లో ఢిల్లీతో జరిగే మ్యాచులో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ: లీ, షఫాలీ వర్మ, లారా, రోడ్రిగ్స్, కాప్, హెన్రీ, నికి ప్రసాద్, స్నేహ్ రాణా, మిన్ను, శ్రీ చరణి, నందని శర్మ
బెంగళూరు: గ్రేస్ హారిస్, స్మృతి మందాన, జార్జియా, రిచా ఘోష్, రాధా యాదవ్, డి క్లర్క్, పూజ, అరుంధతి రెడ్డి, సయాలీ, శ్రేయాంక, లారెన్ బెల్.
News February 5, 2026
జాబ్ క్యాలెండర్ కాదు స్కామ్ క్యాలెండర్: హరీశ్

TG: సీఎం రేవంత్ గతేడాది ప్రతినెలా ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి, నెలకు ఒక స్కామ్ చేశారని హరీశ్ రావు విమర్శించారు. జనవరిలో సివిల్ సప్లైస్, FEBలో ఎన్టీపీసీ ఫ్లై యాష్, మార్చిలో సాండ్, APRలో ఆర్టీసీ, మేలో అమృత్ టెండర్లు, జూన్‌లో ఫోర్త్ సిటీ, జులైలో లగచర్ల ల్యాండ్, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్లు, సెప్టెంబర్‌లో HILTP, అక్టోబర్‌లో విద్యుత్, NOVలో సింగరేణి, డిసెంబర్‌లో KLSR స్కామ్ చేశారని ఆరోపించారు.
News February 5, 2026
భర్తకు ఎడమవైపునే భార్య.. ఎందుకంటే?

హిందూ సంప్రదాయంలో భార్యను భర్తకు ఎడమ వైపున ఉండాలని చెబుతుంటారు. దీనికి ప్రధాన కారణం శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వం. పురాణాల ప్రకారం పరమశివుని శరీరంలో ఎడమ భాగం పార్వతీదేవి ఉంటారు. దీంతోపాటు గుండె ఎడమ వైపున ఉండటంతో భార్య భర్త మనసుకి దగ్గరగా ఉండాలని దీని అంతరార్థం. అందుకే పూజలు, శుభకార్యాల్లో భార్య భర్తకు ఎడమ వైపునే కూర్చుని ధర్మకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.


