News March 25, 2025
SLBC టన్నెల్లో మరో మృతదేహం లభ్యం

TG: SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో మరో మృతదేహం లభ్యమయింది. కన్వేయర్ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. నెల రోజుల క్రితం టన్నెల్లో 8 మంది చిక్కుకోగా ఇటీవల ఓ ఇంజినీర్ డెడ్‌బాడీని వెలికితీశారు.
Similar News
News March 28, 2025
RCB గెలుపు దాహం తీర్చుకుంటుందా?

IPLలో భాగంగా ఇవాళ చెపాక్ స్టేడియంలో RCBvsCSK మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన ఊపును ఇవాళ కూడా కొనసాగించాలని CSK భావిస్తోంది. పైగా ఈ స్టేడియంలో బెంగళూరుపై చెన్నైదే పైచేయి. ఇక్కడ చివరగా 17 ఏళ్ల క్రితం 2008లో CSKపై RCB గెలిచింది. ఆ తర్వాత ఏడు మ్యాచులు ఆడితే ఒక్కటీ గెలవలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలిచి సత్తా చూపెట్టాలని RCB వ్యూహాలు రచిస్తోంది.
News March 28, 2025
వచ్చే నెలలో థాయ్‌లాండ్, శ్రీలంకలో పీఎం పర్యటన

వచ్చే నెల 3 నుంచి 6 వరకు ప్రధాని నరేంద్ర మోదీ థాయ్‌లాండ్, శ్రీలంక దేశాల్లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. బ్యాంకాక్‌లో జరిగే 6వ BIMSTEC సదస్సులో ఆయన పాల్గొంటారని పేర్కొంది. 2018లో నేపాల్‌లో జరిగిన సదస్సు అనంతరం BIMSTEC నేతలు సరాసరి పాల్గొనే తొలి సదస్సు ఇదే. దీని అనంతరం శ్రీలంక పర్యటనలో ఆయన పలు ఒప్పందాల్ని చేసుకునే అవకాశం ఉంది.
News March 28, 2025
మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన కునాల్ కమ్రా

మహారాష్ట్ర Dy. CM శిండేపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కమెడియన్ కునాల్ కమ్రా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. 2021 ఫిబ్రవరి నుంచి కునాల్ తమిళనాడులో ఉంటున్న నేపథ్యంలో ‘అంతర్రాష్ట్ర ముందస్తు బెయిల్’కు దరఖాస్తు చేసుకున్నారు. ‘నాపై పెట్టిన కేసుల్లో న్యాయం లేదు. కేవలం నా వాక్‌స్వేచ్ఛను నేను వాడుకున్నందుకు హింసించాలని చూస్తున్నారు. తప్పుడు కేసులు బనాయించారు’ అని పిటిషన్లో ఆరోపించారు.