News April 18, 2024
KCR అన్న కొడుకుపై మరో కేసు నమోదు

TG: BRS అధినేత KCR అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావుపై బంజారాహిల్స్ PSలో మరో కేసు నమోదైంది. ఓ సమస్య పరిష్కారం కోసం కలిస్తే తనను గెస్ట్‌హౌస్‌లో నిర్బంధించి డబ్బులు వసూలు చేశారని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. నందిని అనే మహిళతో కలిసి రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నాడని బాధితుడు విజయవర్ధన్ పేర్కొన్నారు. కాగా మన్నెగూడ భూవివాదం కేసులో ఇప్పటికే కన్నారావు అరెస్టైన సంగతి తెలిసిందే.
Similar News
News September 16, 2025
CLAT-2026కు దరఖాస్తు చేశారా?

జాతీయ స్థాయిలో న్యాయవిద్య కోసం CLAT-2026కు దరఖాస్తులు కోరుతున్నారు. నేషనల్ లా యూనివర్సిటీల్లో UG, PG కోర్సుల్లో ప్రవేశాలకు OCT-31వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 4000, SC, ST, దివ్యాంగులు రూ. 3,500 చెల్లించాల్సి ఉంటుంది. DEC 7న పరీక్ష నిర్వహించనున్నారు. UG కోర్సులకు ఇంటర్, PG కోర్సులకు LLB డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
News September 16, 2025
మైథాలజీ క్విజ్ – 7

1. మహావిష్ణువు ద్వారపాలకులెవరు?
2. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది?
3. భీష్ముడి అసలు పేరేంటి?
4. గంగోత్రి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. భాద్రపద మాసంలో చవితి రోజున వచ్చే పండుగ ఏది?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. పై ప్రశ్నలకు జవాబులను మైథాలజీ క్విజ్ – 8 (రేపు 7AM)లో పబ్లిష్ చేస్తాం.
<<17697694>>మైథాలజీ క్విజ్-6 <<>>జవాబులు: 1.18 వేలు 2.దండకారణ్యం 3.మధుర 4.గుజరాత్ 5.రాఖీ
News September 16, 2025
రూ.2 లక్షల వరకు ధరలు తగ్గింపు

ప్రీ GST, పండుగ డిస్కౌంట్ కింద కార్ల కంపెనీ కియా ఇండియా తెలుగు రాష్ట్రాల ప్రజలకు రూ.2 లక్షల వరకు ఆఫర్ ప్రకటించింది. సెల్టోస్ మోడల్‌పై రూ.2 లక్షలు, కారెన్స్ క్లావిస్‌పై రూ.1.33 లక్షలు, కారెన్స్‌పై రూ.1.02 లక్షల తగ్గింపు పొందవచ్చని పేర్కొంది. సెప్టెంబర్ 22 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఆఫర్ ఉందని, అయితే ధరల్లో మార్పు ఉంటుందని వెల్లడించింది.