News September 4, 2024
డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం.. షెడ్యూల్ విడుదల

TG: డిగ్రీ ఫస్టియర్లో ఖాళీ సీట్ల భర్తీకి స్పెషల్ డ్రైవ్ ఫేజ్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇంజినీరింగ్ సీట్లు రానివారు డిగ్రీలో చేరేందుకు వీలుగా కౌన్సెలింగ్ షెడ్యూల్ను అధికారులు రిలీజ్ చేశారు. ₹400తో ఈనెల 9 వరకు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, 9న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 11న సీట్ల కేటాయింపు, 11-13 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, 12, 13న కాలేజీల్లో రిపోర్టింగ్ జరగనుంది.
Similar News
News November 28, 2025
APPSC లెక్చరర్ ఫలితాల విడుదల కోసం అభ్యర్థుల విజ్ఞప్తి

APPSC జూలైలో నిర్వహించిన డిగ్రీ లెక్చరర్ పరీక్షా ఫలితాలను త్వరగా విడుదల చేయాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డా.వేపాడ చిరంజీవిరావుని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం విశాఖపట్నంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీలు భర్తీ చేయాలని అభ్యర్థించారు. సమస్యపై చర్యలు తీసుకుంటానని చిరంజీవిరావు తెలిపారు.
News November 28, 2025
అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్: నారాయణ

AP: అమరావతిలో రైల్వేస్టేషన్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసమే మరో 16వేల ఎకరాలను సమీకరిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఎయిర్పోర్ట్ లేనిదే రాజధాని అభివృద్ధి చెందదని.. అందుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని సీఎం నిర్ణయించారన్నారు. గతంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎకరాలు మాత్రమే కేటాయించగా ఇప్పుడు 2,500 ఎకరాలు ఇచ్చామని వివరించారు.
News November 28, 2025
డిసెంబర్ పెన్షన్లకు రూ.2,739 కోట్లు విడుదల

AP: సీఎం చంద్రబాబు డిసెంబర్ 1న ఏలూరు జిల్లా గోపాలపురంలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. DEC పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,738.71 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 63,25,999 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ నెలలో నూతనంగా 8,190 పెన్షన్లు మంజూరు చేశామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పెన్షన్ల రూపంలో రూ.21,280 కోట్లు అందజేశామని వివరించారు.


