News April 10, 2025
మరో క్రేజీ స్పేస్ మిషన్

జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూఆరిజన్ కంపెనీ మరో క్రేజీ స్పేస్ మిషన్(NS-31)కు సిద్ధమవుతోంది. ఆరుగురు మహిళా వ్యోమగాములతో కూడిన రాకెట్ టెక్సాస్ నుంచి APR 14న నింగిలోకి దూసుకెళ్లనుంది. 100KM ఎత్తులో ఉన్న కర్మాన్ లైన్(భూమి వాతావరణానికి, స్పేస్‌కు మధ్య ఉన్న ప్రాంతం) 11 నిమిషాల్లో వెళ్లనుంది. ఈ ప్రయాణంలో వెయిట్ లెస్ పరిస్థితులు, భూమి అందాలను వీక్షించిన అనంతరం వారు పారాచూట్ల సాయంతో భూమిపైకి రానున్నారు.
Similar News
News November 27, 2025
వంటింటి చిట్కాలు

* కూరల్లో పెరుగు వేసేటప్పుడు నేరుగా కలపకుండా, ఒక కప్పులో వేసి స్పూన్‌తో చిలికి వెయ్యాలి. అప్పుడే గ్రేవీ మొత్తానికి చిక్కదనం వస్తుంది.
* పాలు మాడకుండా ఉండాలంటే కాచే ముందు గిన్నెలో కొద్దిగా చన్నీరు పోసి వంపేయాలి.
* కిస్మిస్ నిల్వ ఉండాలంటే గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేస్తే నెలల తరబడి ఫ్రెష్‌గా ఉంటాయి.
* గుడ్లు ఉడికించేటప్పుడు కాస్త నూనె వేస్తే పగలవు.
News November 27, 2025
సర్పంచ్ ఎన్నికలు.. నామినేషన్లు ప్రారంభం

TG: గ్రామాల్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఎల్లుండి వరకు కొనసాగనుంది. తొలి విడతలో 4,236 గ్రామాలు, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11న ఉ.7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.
News November 27, 2025
సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


