News January 10, 2025
మరో క్రికెటర్ విడాకులు?

భారత క్రికెటర్లు వైవాహిక జీవితాన్ని నిలుపుకోవడంలో విఫలం అవుతుండటం ఫ్యాన్స్కు ఆందోళన కలిగిస్తోంది. క్రికెటర్లు వరుసగా విడాకులు తీసుకుంటున్నారు. ఈ జాబితాలో మరో క్రికెటర్ మనీశ్ పాండే చేరినట్లు తెలుస్తోంది. 2019లో నటి ఆశ్రితా శెట్టిని మనీశ్ వివాహమాడిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ఒకరినొకరు ఇన్స్టాలో అన్ఫాలో చేసుకున్నారని, పెళ్లి ఫొటోలు డిలీట్ చేసుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
Similar News
News January 16, 2026
Money Tip: మీకు మీరే శిక్ష వేసుకోండి.. వినూత్న పొదుపు మంత్రం!

మీకున్న చెడు అలవాట్లపై మీరే పన్ను వేసుకోండి. డబ్బు ఆదా చేయడానికి ఇదొక వినూత్న మార్గం. అనవసర ఖర్చు చేసినప్పుడు అంతే మొత్తాన్ని పెనాల్టీగా మీ సేవింగ్స్ అకౌంట్లోకి డిపాజిట్ చేయండి. Ex ఒక బర్గర్ కొంటే దానికి సమానమైన డబ్బును వెంటనే అకౌంట్కు మళ్లించాలి. ఇలా చేస్తూ వెళ్తే పోగైన డబ్బును బట్టి మీకున్న బ్యాడ్ హాబిట్స్ వల్ల ఎంత నష్టమో తెలుస్తుంది. అలాగే క్రమశిక్షణ అలవడుతుంది. పొదుపు అలవాటవుతుంది.
News January 16, 2026
అధిక పోషకాల పంట ‘ఎర్ర బెండ’

సాధారణంగా దేశీయ బెండ(లావుగా, పొట్టిగా), హైబ్రిడ్ బెండ రకాలు ఆకుపచ్చగా (లేదా) లేత ఆకుపచ్చగా ఉండటం గమనిస్తాం. కానీ ఎర్ర బెండకాయలను కూడా సాగు చేస్తారని తెలుసా. ‘ఆంతో సయనిన్’ అనే వర్ణ పదార్థం వల్ల ఈ బెండ కాయలు, కాండం, ఆకు తొడిమెలు, ఆకు ఈనెలు ఎర్రగా ఉంటాయి. ఆకుపచ్చ బెండ కంటే వీటిలో పోషకాల మోతాదు ఎక్కువ. ఎర్ర బెండలో ‘కాశి లాలిమ’, ‘పూసా రెడ్ బెండి-1’ రకాలు అధిక దిగుబడినిస్తాయి.
News January 16, 2026
PCOSకి చెక్ పెట్టే చియా సీడ్స్

ప్రస్తుతకాలంలో చాలామందిని బాధించే సమస్య PCOS. దీనివల్ల బరువు పెరగడం, పీరియడ్స్ సరిగా రాకపోవడంలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే PCOSకి చియాసీడ్స్ పరిష్కారం చూపుతాయంటున్నారు నిపుణులు. వీటిలో పీచు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను నెమ్మది చేసి, చక్కెర శోషణను తగ్గిస్తాయి. దీనివల్ల రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. బరువును తగ్గిస్తుంది.


