News October 6, 2025
తురకపాలెంలో మళ్లీ మృత్యు కలకలం!

AP: గుంటూరు రూరల్(M) తురకపాలెంలో కృష్ణవేణి అనే మహిళ హైఫీవర్‌తో గుంటూరు ఆసుపత్రిలో మరణించింది. గతంలో 30 వరుస మరణాలతో గ్రామం వార్తల్లోకి ఎక్కింది. పారిశుద్ధ్యం లేకపోవడం, నీటిలో యురేనియం అవశేషాల వల్లే ఇలా అవుతోందని తేలింది. ప్రభుత్వం వైద్య బృందాలను పంపి నివారణ చర్యలు చేపట్టింది. నెలరోజుల పాటు ఇవి ఆగడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా గతంలోలాగే మహిళ మరణించడంతో జనం కలవరపడుతున్నారు.
Similar News
News October 6, 2025
ఫ్రాన్స్ ప్రధాని రాజీనామా

ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను నెల రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు. ఆయన నియమించిన క్యాబినెట్‌పై విమర్శలు రావడంతో పదవి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ప్రధానిగా ఫ్రాంకోయిస్ బయ్రూ అవిశ్వాసతీర్మానంలో ఓటింగ్ ద్వారా పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే.
News October 6, 2025
PCOSలో ఎన్ని రకాలున్నాయో తెలుసా?

ప్రస్తుతకాలంలో చాలామందిలో PCOS సమస్య కనిపిస్తోంది. అయితే వీటిలో A, B, C, D అని నాలుగు రకాలున్నాయంటున్నారు నిపుణులు. Aలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, అండం విడుదల కాకపోవటం, అండాశయాల్లో తిత్తులు ఉంటాయి. Bలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, నెలసరి అస్తవ్యస్తమవటం ఉంటాయి. Cలో- మగ హార్మోన్లు, తిత్తులూ ఉంటాయి. కానీ నెలసరి అవుతుంది. Dలో నెలసరి రాకపోవడం , తిత్తులు ఉన్నప్పటికీ మగ హార్మోన్లు ఎక్కువగా ఉండవు.
News October 6, 2025
సిరప్‌తో 14మంది పిల్లల మరణాలపై విచారణకు SIT

కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్‌తో 14 మంది పిల్లలు మరణించడంపై MP ప్రభుత్వం SIT ఏర్పాటుచేసింది. వారు నెల రోజులుగా అస్వస్థతకు లోనైనా అదే సిరప్ ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ ప్రవీణ్‌ని ఇప్పటికే అరెస్టు చేసింది. డ్రగ్ కంపెనీపై కేసు పెట్టింది. మహారాష్ట్ర, TN లో ఘటనలు చోటుచేసుకోగా ఆ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. కాగా సిరప్ విషమయమని తనకు తెలియదని డాక్టర్ పేర్కొన్నారు. అరెస్టుపై MP డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు.