News September 19, 2024
సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లపై ప్రభుత్వం మరో నిర్ణయం

న్యూస్ పేపర్ కొనుగోలు కోసం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు ప్రతి నెలా ఇచ్చే రూ.200 భత్యాన్ని రద్దు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల ఏడాదికి రూ.102 కోట్ల నష్టం వాటిల్లిందని, దీనిపై కమిటీ వేసి పూర్తి వివరాలను సేకరించాలని CM చంద్రబాబు సూచించారు. మరోవైపు ‘సాక్షి’ పేపర్ కొనుగోలుతో రెండేళ్లలో రూ.205 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు.
Similar News
News November 13, 2025
మహావిష్ణువు పేరును ఎందుకు స్తుతించాలి?

జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం|
స్తువన్నా మసహస్రేణ పురుషస్సతతోత్థితః||
భారతంలో భీష్ముడు, ధర్మరాజుకు ఈ శ్లోకాన్ని చెప్పారు. ‘జగత్ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అయిన విష్ణువును వేయి నామాలతో స్తుతించిన పురుషుడికి నిత్యం శుభాలు కలుగుతాయి’ అనేది దీనర్థం. నిరంతరం విష్ణు నామాన్ని స్మరిస్తూ, ఆయన సేవ చేసే వ్యక్తికి ఎప్పుడూ మంచే జరుగుతుందని ఈ శ్లోకం వివరిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 13, 2025
ఇండియా A విజయం

సౌతాఫ్రికా Aతో జరిగిన తొలి అనధికార వన్డేలో ఇండియా A విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 285 రన్స్ చేసింది. అనంతరం భారత్ 49.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (117) సెంచరీతో అదరగొట్టారు. తిలక్ వర్మ 39, నితీశ్ 37, అభిషేక్ శర్మ 31 రన్స్ చేశారు.
News November 13, 2025
ఉచితంగానే సదరం స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్: సత్యకుమార్ యాదవ్

AP: దివ్యాంగుల పెన్షన్ కోసం సదరం స్లాట్ బుకింగ్ రేపట్నుంచి ప్రారంభమవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకున్న 10వేల మందికి తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. దివ్యాంగుల ఆర్థికస్థితిని పరిగణనలోకి తీసుకొని స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ ముద్రణకు గతంలో ₹40 చొప్పున ఉన్న ఫీజును రద్దు చేసినట్లు చెప్పారు. సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే కొత్త పెన్షన్లను అధికారులు మంజూరు చేస్తారు.


