News October 26, 2024
తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి

ప్రో-కబడ్డీ లీగ్ 2024లో తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి ఎదురైంది. దబాంగ్ ఢిల్లీతో జరిగిన హోరా హోరీ పోరులో 37-41 పాయింట్లతో ఓడిపోయింది. ఢిల్లీ ప్లేయర్లలో నవీన్, అషు మాలిక్ తలో 15 పాయింట్లు చేయగా TT కెప్టెన్ పవన్ షెరావత్ ఏకంగా 18 పాయింట్లు చేయడం గమనార్హం. కాగా తెలుగు టైటాన్స్‌కు ఇది వరుసగా మూడో ఓటమి.
Similar News
News March 18, 2025
తల్లి, సోదరుడి శవాలతో నెల రోజులుగా ఇంట్లోనే..

AP: తల్లి, సోదరుడి మృతదేహాలతో ఓ వ్యక్తి నెల రోజులుగా ఇంట్లోనే ఉంటున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కడప శాటిలైట్ సిటీలో నివాసముంటున్న వృద్ధురాలికి ఇద్దరు కొడుకులు(45,55 ఏళ్లు) ఉన్నారు. నెల కిందట ఆమె చనిపోగా, ఓ కొడుకు ఉరేసుకున్నాడు. ఈ ఇద్దరు కుమారులు ఎవరితో మాట్లాడేవారు కాదు. దీంతో ఆ ఇంటి నుంచి దుర్వాసన వచ్చే దాకా విషయం బయటకు రాలేదు. స్థానికులు మానసిక స్థితి లేని మరో కుమారుడిని ఆశ్రమానికి తరలించారు.
News March 18, 2025
ఇండియా గురించి ఈ విషయాలు తెలుసా?

మన దేశంలో 2024 నాటికి 143+ కోట్ల మంది జనాభా ఉండగా అందులో 136 కోట్ల మందికి ఆధార్ కార్డులున్నాయి. 95 కోట్ల ఓటర్లుంటే 120 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. 65 కోట్ల మంది ఇ-కామర్స్, 80 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ యూజర్లు, 50 కోట్ల మంది ఓటీటీ సబ్స్క్రైబర్లున్నారు. UPI యూజర్లు 42 కోట్లు కాగా 28 కోట్ల మంది ఫుడ్ డెలివరీ యాప్స్ వాడుతున్నారు. అలాగే 39% మంది అర్బన్‌లో 61% మంది రూరల్ ఏరియాల్లో జీవిస్తున్నారు.
News March 18, 2025
NTR జిల్లా పేరు ఎందుకు మార్చలేదు?: షర్మిల

AP: చంద్రబాబు తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఉందని షర్మిల అన్నారు. ‘NTR పేరును జగన్ మారిస్తే, YSR పేరు మార్చి CBN ప్రతీకారం తీర్చుకుంటున్నారు. YSR జిల్లాను YSR కడప జిల్లాగా సవరించడంలో అభ్యంతరం లేదు. తాడిగడప మున్సిపాలిటీకి YSR పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నాం. NTR జిల్లా పేరును NTR విజయవాడగా లేదా పాత కృష్ణా జిల్లా పేరును NTR కృష్ణా జిల్లాగా ఎందుకు మార్చలేదు?’ అని ప్రశ్నించారు.