News February 28, 2025
అప్పుల బాధ.. మరో రైతు ఆత్మహత్య

TG: రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పుల బాధతో ఇటీవల నలుగురు రైతులు బలవన్మరణం చెందగా నిన్న మరో రైతు తనువు చాలించారు. భూపాలపల్లి జిల్లా వెంకటేశ్వరపల్లికి చెందిన బండారి రవి(54) రెండెకరాల్లో మిర్చి వేశారు. పంట పెట్టుబడి, కూతురు పెళ్లి కోసం రూ.10లక్షల అప్పు చేశారు. మిర్చికి గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పు చెల్లించలేకపోయారు. దీంతో పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నారు.
Similar News
News October 17, 2025
సమ్మె విరమించాల్సిందే!

AP: సమ్మె విరమించాలని, లేకపోతే చర్యలు తప్పవని PHC వైద్యులను వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరణతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి గత నెల 30 నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఉన్నతాధికారులు చర్చలు జరిపినా సఫలం కాలేదు. ఎస్మా సైతం ప్రయోగిస్తామని చెప్పినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. తాజాగా నోటీస్-3 జారీ చేయగా, PHC వైద్యులు ఏం విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
News October 17, 2025
‘గోత్రం’ అంటే మీకు తెలుసా?

గోత్రం అంటే ‘గోవులను రక్షించువారు’ అని అర్థం. ‘గో’ అంటే గోవులు. ‘త్ర’ అంటే రక్షించడం. క్షీర సాగర మథన సమయంలో 5 గోవులు ఉద్భవించాయి. ఒక్కో గోవును ఒక్కో మహర్షి తీసుకెళ్లి, పెంచి, వాటి సంతతిని కాపాడి, సమాజంలోని అందరికీ అందించారు. ఆ గోవులను కాపాడిన మహర్షుల పేర్ల మీద మన గోత్రాలు ఏర్పడ్డాయి. గోత్రం ఉండే ప్రతి ఒక్కరూ గోవులను రక్షించేవారేనని అర్థం.
☞ మరిన్ని ధర్మ సందేహాల నివృత్తి కోసం <<-se_10013>>భక్తి <<>>కేటగిరీ.
News October 17, 2025
గర్భాన సంక్రాంతి విశేషాలు మీకు తెలుసా?

తులా సంక్రమణాన్ని గర్భాన సంక్రాంతి అని కూడా అంటారు. గర్భం దాల్చిన తల్లి తన సంతానంపై ఎలా సంతోషపడుతుందో, రైతులు తాము పండించిన పైరు ఫలితాన్ని కూడా అలాగే వేడుక చేసుకుంటారు. అందుకే దీనిని గర్భాన సంక్రాంతి అని అంటారు. ఈ పండుగ పంట కోతలు, సమృద్ధిని సూచిస్తుంది. ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకొంటారు. ఆహార కొరత రాకుండా, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నేడు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ.