News June 5, 2024
టీఎంసీలో మరో ఫైర్ బ్రాండ్!

TMCలో మరో ఫైర్ బ్రాండ్ లేడీ సయోనీ ఘోష్ జాదవ్పూర్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. బీజేపీకి ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ దీదీ లాగానే ఆ పార్టీలో పవర్ఫుల్ మహిళగా గుర్తింపు పొందారు. నటి అయిన ఆమె రాజకీయాల్లోకి వచ్చి చేసేదేమీ లేదని BJP విమర్శించినా.. దానిని సవాలుగా తీసుకుని సివంగిలా దూసుకొచ్చారు. అనర్గళంగా ప్రసంగిస్తూ BJPకి దడ పుట్టించారు. భవిష్యత్తులో ఆమె మంచి నేత అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.
Similar News
News November 28, 2025
గొర్రెల్లో బొబ్బ రోగం(అమ్మతల్లి) ఎలా గుర్తించాలి?

ఇది ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.
News November 28, 2025
తిరుమల శ్రీవారి పుష్పాలను ఏం చేస్తారో తెలుసా?

తిరుమల శ్రీవారి సేవ కోసం రోజుకు కొన్ని వందల కిలోల పూలు వాడుతారు. మరి వాటిని ఏం చేస్తారో మీకు తెలుసా? పూజ తర్వాత వాటిని బయట పడేయరు. తిరుపతికి తరలిస్తారు. అక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలోని పూల ప్రాసెసింగ్ యూనిట్కు పంపుతారు. ఈ యూనిట్లో ఈ పూల నుంచి పరిమళభరితమైన అగరబత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలను తయారుచేస్తారు. తద్వారా పూల పవిత్రతను కాపాడుతూనే, వాటిని ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మారుస్తారు.
News November 28, 2025
2026 సెలవుల జాబితా విడుదల

కేంద్రం 2026 సంవత్సరానికి అధికారిక <


