News February 26, 2025
HYDలో అందుబాటులోకి వచ్చిన మరో ఫ్లైఓవర్

TG: హైదరాబాద్ నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. గోల్నాక చర్చి నుంచి ఛే నంబర్ మీదుగా అంబర్పేట్ వరకు నిర్మించిన ఈ పైవంతెనపై నేటి నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. రూ.445 కోట్లతో 1.65 కి.మీ పొడవునా 4 లేన్లతో దీన్ని నిర్మించారు. 2018లో దీనికి శంకుస్థాపన చేశారు. ఉప్పల్ నుంచి MGBS, సిటీ నుంచి వరంగల్ హైవే వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ తగ్గనుంది.
Similar News
News February 26, 2025
తండ్రి నిర్దోషని నిరూపించేందుకు లాయర్లుగా మారిన పిల్లలు!

తప్పు చేయకపోయినా చాలా మంది జైళ్లలో శిక్ష అనుభవిస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు అతని పిల్లలు లాయర్లుగా మారారు. యూపీలోని కాన్పూర్లో జరిగిన ఓ వివాదంలో అనిల్ గౌర్పై తప్పుడు ఆరోపణల కారణంగా అతను 11 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. అతడు నిర్దోషని నిరూపించేందుకు కొడుకు రిషభ్, కూతురు ఉపాసన లా చదివారు. తండ్రి కేసుపై ఇద్దరూ అవిశ్రాంతంగా పనిచేసి విజయం సాధించారు.
News February 26, 2025
రాజౌరీలో ఆర్మీ వెహికల్పై ఉగ్రదాడి

జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. నియంత్రణ రేఖ సమీపంలో టెర్రరిస్టులు ఆర్మీ వాహనంపై దాడిచేశారు. అడవిలో దాక్కున్న ముష్కరులు సుందర్బని సెక్టార్లోని ఫాల్ గ్రామంలో వెళ్తున్న వాహనంపై ఫైరింగ్ చేశారు. వెంటనే భారత జవాన్లు ప్రతిఘటనకు దిగారు. పారిపోయిన టెర్రరిస్టులను పట్టుకొనేందుకు ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ఆరంభించింది.
News February 26, 2025
ఆ ఇద్దరి కళ్లల్లో ఆనందం ఏమిటో?: BRS

TG: CM రేవంత్ నడుపుతున్నది కాంగ్రెస్-BJP సంకీర్ణ సర్కార్ అని BRS ఆరోపించింది. ‘MLC ఎన్నికల ఓటింగ్కు ముందు రోజు BJP ప్రధానిని, కాంగ్రెస్ CM కలవడంలో మర్మం ఏంటి? మేము గెలిచినా ఓడినా మాకు ఏమి ఫరక్ పడదు అని CM అనడంలో మతలబు ఏంటి? ఆ ఇద్దరి కళ్లల్లో ఆనందం ఏమిటో? మోదీ అపాయింట్మెంట్ సులువుగా దొరకడం ఏమిటో రాహుల్ అపాయింట్మెంట్ దొరకకపోవడం ఏమిటో?’ అంటూ పీఎం, సీఎం భేటీకి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేసింది.