News March 31, 2025
రేపటి నుంచి మరో ఉచిత సిలిండర్: నాదెండ్ల

AP: దీపం-2 పథకం కింద ఇప్పటి వరకు 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. లబ్ధిదారులకు ఏప్రిల్ 1 నుంచి జులై 31 మధ్య మరో సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. విశాఖలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి కల్పించాలని పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారని చెప్పారు. త్వరలోనే భారీ పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News November 28, 2025
అమరావతిలో 2వ దశ భూ సమీకరణకు కేబినెట్ ఆమోదం

అమరావతిలో రెండోవ దశ భూ సమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 7 గ్రామాల పరిధిలో 16.666.5 ఎకరాల సమీకరణ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. పల్నాడు (D) అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాలు కాగా, గుంటూరు (D) తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో భూ సమీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
News November 28, 2025
వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.
News November 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 80 సమాధానాలు

ప్రశ్న: ఉప పాండవులను ఎవరు, ఎందుకు చంపారు?
సమాధానం: ఉప పాండవులను చంపింది అశ్వత్థామ. కురుక్షేత్రంలో తన తండ్రి ద్రోణాచార్యుడి మరణానికి ప్రతీకారంగా, ఆయనను అన్యాయంగా చంపారని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యుద్ధ రీతిని వీడి, నైతికతను మరచి నిద్రిస్తున్న పాండవుల కుమారులను పాండవులుగా భ్రమించి దారుణంగా చంపాడు. కౌరవ సేనాపతిగా చనిపోతున్న దుర్యోధనుడికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


