News April 17, 2025

భారత్‌కు మరో స్వర్ణం

image

పెరూలో జరుగుతున్న ISSF వరల్డ్ కప్‌లో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. మిక్స్‌డ్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సౌరభ్ చౌదరీ, సురుచి సింగ్ జోడీ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు 10 మీటర్ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో సురుచి స్వర్ణం, మను భాకర్ రజతం గెలుచుకున్నారు.

Similar News

News April 19, 2025

నేడు ఐపీఎల్‌లో డబుల్ ధమాకా

image

IPLలో ఇవాళ 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. మ.3.30కు అహ్మదాబాద్ వేదికగా టైటాన్స్‌తో ఢిల్లీ తలపడనుంది. ఇప్పటి వరకూ ఈ రెండింటి మధ్య 5 మ్యాచులు జరగ్గా DC 3, GT 2 సార్లు గెలిచాయి. అలాగే, రాత్రి 7.30కు జైపూర్‌లో రాజస్థాన్, లక్నో బరిలోకి దిగనున్నాయి. ఈ టీమ్స్ గతంలో ఐదుసార్లు తలపడితే రాజస్థాన్‌(4)దే పైచేయిగా నిలిచింది. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న RR కెప్టెన్ శాంసన్ ఈ మ్యాచ్ ఆడటంపై సందిగ్ధం నెలకొంది.

News April 19, 2025

మే 2న కేదార్‌నాథ్, 4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్

image

చార్‌ధామ్ యాత్రలో ముఖ్యమైన కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని మే 2న తెరవనున్నట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధికార ప్రతినిధి తెలిపారు. అలాగే, మే 4న బద్రీనాథ్ ఆలయాన్ని ఓపెన్ చేస్తామన్నారు. వీటితో పాటు రెండో కేదార్‌గా పిలవబడే మద్‌మహేశ్వర ఆలయాన్ని మే 21న, మూడో కేదార్ తుంగ గుడిని మే 2న తెరుస్తామని వివరించారు. విపరీతమైన మంచు వల్ల వేసవిలో కొన్ని రోజుల పాటే ఈ ఆలయాలు తెరిచి ఉంటాయి.

News April 19, 2025

RBI వద్ద 879 టన్నుల పసిడి నిల్వలు

image

ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి RBI వద్ద 879 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దీని విలువ రూ.6.83 లక్షల కోట్లు అని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో పసిడి నిల్వలు పెంచుకునేందుకు RBI ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 2024లో ఏకంగా 72.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులన్నీ పసిడి నిల్వలు పెంచుకుంటున్న క్రమంలో RBI కూడా అదే కోవలో పయనిస్తోంది.

error: Content is protected !!