News December 12, 2024

అమరావతికి మరో గుడ్‌న్యూస్

image

AP రాజధాని అమరావతికి రూ.8వేల కోట్ల రుణం మంజూరుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆమోదం తెలిపింది. రుణాన్ని ఆమోదిస్తూ ADB బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకోగా, ఇవాళ్టి కలెక్టర్ల సమావేశంలో CRDA కమిషనర్ ఆ విషయం వెల్లడించారు. ఈ నెల 19న జరిగే ప్రపంచబ్యాంకు బోర్డు సమావేశంలో ఆమోదం తర్వాత ఒప్పంద పత్రాలను అధికారులు మార్చుకోనున్నారు. తొలి విడతలో రూ.3వేల కోట్లు రిలీజ్ కానున్నాయి. ఆ తర్వాత మిగతావి విడుదలవుతాయి.

Similar News

News November 20, 2025

మూవీ రూల్స్‌కు రీడైరెక్ట్ కావడంపై విచారణలో రవికి ప్రశ్నలు

image

ఐ-బొమ్మ కేసులో రవి పోలీస్ కస్టడీ తొలిరోజు ముగిసింది. వెబ్‌సైట్‌కు సంబంధించి కీలక విషయాలపై పోలీసులు ఆరా తీశారు. ఇవాళ వెలుగులోకి వచ్చిన ‘ఐబొమ్మ వన్’పైనా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దాని నుంచి మూవీ రూల్స్‌కు రీడైరెక్ట్ కావడంపై రవిని అడిగారు. అతడు వాడిన మొబైల్స్ వివరాలు, నెదర్లాండ్స్‌లో ఉన్న హోమ్ సర్వర్ల డేటా, హార్డ్ డిస్క్‌ల పాస్‌వర్డ్, NRE, క్రిప్టో కరెన్సీ, పలు వ్యాలెట్లపై సుదీర్ఘంగా విచారించారు.

News November 20, 2025

అపార్ట్‌మెంట్‌లో అందరికీ ఒకే వాస్తు ఉంటుందా?

image

అపార్ట్‌మెంట్ ప్రాంగణం ఒకటే అయినా వేర్వేరు బ్లాక్‌లు, టవర్లలో దిశలు మారుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలుపుతున్నారు. ‘సింహద్వారం దిశ, గదుల అమరిక వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల ప్రతి ఫ్లాట్‌కి వాస్తు ఫలితాలు కూడా మారుతాయి. అందరికీ ఒకే వాస్తు వర్తించదు. ప్రతి ఫ్లాట్‌ని దాని దిశ, అమరిక ఆధారంగానే చూడాలి. మీ జన్మరాశి, పేరు ఆధారంగా వాస్తు అనుకూలంగా ఉందో లేదో చూడాలిలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 20, 2025

2031కి 100 కోట్ల 5G సబ్‌స్క్రిప్షన్లు

image

2031 చివరికి భారత్‌లో 5G సబ్‌స్క్రిప్షన్లు 100 కోట్లు దాటుతాయని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ అంచనా వేసింది. 2031 వరకు మొబైల్ సబ్‌స్క్రిప్షన్లలో 79% 5జీకి మారుతాయని పేర్కొంది. 2025 చివరికి 394 మిలియన్లకు సబ్‌స్క్రిప్షన్లు చేరుకున్నాయని, ఇది మొత్తం సబ్‌స్క్రిప్షన్లలో 32 శాతమని తెలిపింది. దేశంలో పెరుగుతున్న మొబైల్ డేటా వినియోగం, నెట్‌వర్క్ విస్తరణ, 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోళ్లే నిదర్శనమని చెప్పింది.