News July 31, 2024

రైతు రుణమాఫీపై మరో గుడ్‌న్యూస్

image

TG: పట్టాదారు పాస్‌బుక్ లేకున్నా రుణమాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అలాంటి రైతుల ఇళ్ల వద్దకే అధికారులు వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు లోన్లు తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందన్నారు. గత ప్రభుత్వం పంట వేయని భూములకు రూ.25వేల కోట్లు మాఫీ చేసిందని విమర్శించారు. అటు పంట వేసిన వారికే రైతు భరోసా ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Similar News

News November 28, 2025

NZB: ఏకగ్రీవాల కోసం బలవంతం చేయకూడదు: కలెక్టర్

image

జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకాగ్రీవాల కోసం బలవంతపు విధానాలను అవలంభించకూడదని NZB కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. బలవంతం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా అన్ని వర్గాల వారు జిల్లా యంత్రాంగానికి సహరించాలని కలెక్టర్ కోరారు.

News November 28, 2025

KNR: శిశుగృహ, బాలసదనం నుంచి పిల్లల దత్తత

image

పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్‌ శిశు గృహంలో పెరుగుతున్న 4నెలల వయసున్న ఆడ శిశువును హుస్నాబాద్‌కు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న 13సం.ల బాలికను తమిళనాడుకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా దంపతులకు పిల్లలను దత్తత ఇచ్చారు.

News November 28, 2025

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రకాశం కలెక్టర్

image

ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ చెప్పారు. గురువారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ఇప్పటివరకు వచ్చిన పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరిస్థితిని కలెక్టర్ రాజాబాబు వివరించారు. ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసినట్లు ఆన్లైన్‌లో నమోదు చేయాల్సి ఉందన్నారు.