News September 3, 2024
పొంచి ఉన్న మరో తీవ్ర ప్రమాదం.. జాగ్రత్త

AP, TGలో భారీ వర్షాలు, వరదలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు సొంతిళ్లకు చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. వరదలు తెచ్చిన బురద, చెత్తాచెదారంతో దోమలు విజృంభించనున్నాయి. వీటి వల్ల డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు పెరగనున్నాయి. వీటిని అరికట్టడంపై ప్రభుత్వ విభాగాలు దృష్టిసారించాల్సి ఉంది. లేదంటే ఆరోగ్య విపత్తు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
Similar News
News November 25, 2025
వేములవాడ ఆసుపత్రిలో ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో మంగళవారం ఉచిత కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరం జరిగింది. ఈ శిబిరంలో మొత్తంగా 31 మంది మగవారికి కోత, కుట్టులేని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. వేములవాడ, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాలకు చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ శిబిరంలో డాక్టర్లు పెంచలయ్య, రమేష్, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా?: రాజాసింగ్

TG: అయ్యప్ప మాల వేసుకున్న హైదరాబాద్ కంచన్బాగ్ ఎస్సైకి ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. పోలీసుల రూల్స్ కేవలం హిందువులకే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులకు ఫ్రీడమ్ ఇచ్చి హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. రంజాన్ సమయంలో ఇలాంటి రూల్స్ ఎందుకు పెట్టరని మండిపడ్డారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని సూచించారు.