News April 10, 2025
APలో మరో ఘోరం.. మహిళను వివస్త్రను చేసి కొట్టిచంపారు?

AP: నెల్లూరు జిల్లాలో మహిళ దారుణ హత్య సంచలనం రేపుతోంది. ఆమెను వివస్త్రను చేసి భర్త, అత్తమామలు, ఆడబిడ్డ కొట్టిచంపినట్లు ప్రచారం జరుగుతోంది. కట్నం కోసం హత్య చేసి, ఆత్మహత్య చేసుకుందంటూ డ్రామా ఆడినట్లు సమాచారం. మహిళ మృతదేహన్ని నెల్లూరు GGHకు తరలించి, పోలీసులు విచారణ చేపట్టారు. భర్త, అత్తమామలు, ఆడపడుచు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 18, 2025
TCS లే ఆఫ్స్‌పై ఉద్యోగుల ఫిర్యాదు

USలోని TCS కంపెనీపై ఆ దేశ ‘సమాన ఉపాధి హక్కుల కమిషన్’ విచారణ చేపట్టింది. ఇండియాకు చెందిన హెచ్1బీ వీసాదారులకు లేఆఫ్స్ ఇవ్వకుండా కేవలం దక్షిణాసియేతర ఉద్యోగులనే పక్షపాతంగా తొలగిస్తున్నారని ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఆరోపణలను TCS ప్రతినిధులు ఖండించారు. మెుదటి నుంచి TCS సంస్థ సమానత్వం, సమగ్రత కల్పించడంతో ముందు స్థానంలో ఉంటుందని తెలిపారు.
News April 18, 2025
భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో వీటికి చోటు దక్కింది. ఇది ప్రపంచంలోని ప్రతీ భారతీయుడికి గర్వకారణమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారతీయ సంస్కృతికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చిందన్నారు. భగవద్గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా దేశ నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయని పేర్కొన్నారు.
News April 18, 2025
ఏసుక్రీస్తు త్యాగాన్ని గుర్తుచేసుకోవాలి: PM మోదీ

గుడ్‌ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులనుద్దేశించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ పవిత్ర రోజున ఏసుక్రీస్తు త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలన్నారు. ఆయనలోని దయ, కరుణ, క్షమాపణ వంటి సద్గుణాలు మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చెప్పారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం క్రీస్తు గొప్పతనాన్ని గుర్తు చేశారు. తన శరీరంలోకి మేకులు దించిన సమయంలో కూడా ఏసుక్రీస్తు శాంతిని ప్రబోధించారన్నారు.