News June 24, 2024
‘కన్నప్ప’లో మరో హీరో?

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీలో కోలీవుడ్ హీరో శింబు నటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో కొన్ని సీన్స్లో ఆయన కనిపిస్తారని సమాచారం. ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకి మణిశర్మ, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 5, 2025
CCRHలో 90 పోస్టులు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<
News November 5, 2025
భార్యాభర్తల మధ్య అనుబంధాల కోసం..

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వ్రతంలో భాగంగా మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా ఉపయోగించి పూజించడం సంప్రదాయం. నేడు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల పూజాఫలం, పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని, ఇహపరలోకాలలో సుఖసౌఖ్యాలు, ముక్తి లభిస్తాయని పండితులు అంటున్నారు.
News November 5, 2025
మిరపలో కుకుంబర్ మొజాయిక్ తెగులను ఎలా నివారించాలి?

మిరప పంటను ఆశించే ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పొట్టిగా కనిపిస్తాయి. ఆకులు రంగుమారిపోతాయి. మొక్కలకు పూత ఉండదు. ఈ వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వ్యాధిని వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


