News September 13, 2025
SMకు దూరంగా ఉంటా.. మరో హీరోయిన్ ప్రకటన

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. ‘సోషల్ మీడియా నా పనిపై, ఆలోచనలపై దృష్టి పెట్టకుండా చేస్తోంది. నా సృజనాత్మకతను దెబ్బతీసింది. నాలోని కళాకారిణిని, నన్ను రక్షించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా. అయినా నిజమైన సంబంధాలను ఏర్పరచుకోవడంపై దృష్టి పెడతా’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. <<17686001>>అనుష్క<<>> కూడా SMకు దూరంగా ఉంటానని ఇటీవల ప్రకటించింది.
Similar News
News March 11, 2026
ఈ టైమ్‌లో ఎండలో నిలబడండి..

భారతదేశంలో సూర్యరశ్మి పుష్కలంగా ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలు విటమిన్-డి లోపంతో సతమతమవుతున్నారు. మీకు 30-100 ng/mL మధ్య ఉంటే డి విటమిన్ సరిపడా ఉందని అర్థం. సహజంగా దీనిని పెంచుకునేందుకు రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య కనీసం 30 నిమిషాలు ఎండలో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎముకల పుష్టికి, రోగనిరోధక శక్తికి ఈ ‘సన్ షైన్’ విటమిన్ ఎంతో కీలకమని పేర్కొన్నారు.
News March 11, 2026
2 రోజుల్లో ₹51,400 కోట్ల ఆయుధాలు

ఇరాన్ యుద్ధంలో అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. యుద్ధం మొదలైన మొదటి 48 గంటల్లోనే ట్రంప్ యంత్రాంగం సుమారు ₹51,400 కోట్ల విలువైన ఆయుధాలను వాడేసినట్లు సమాచారం. కేవలం క్షిపణులు, బాంబులకే ఇంత ఖర్చు కాగా.. సైనిక మోహరింపు వ్యయం అదనం. ఈ స్థాయిలో ఖర్చు చేయడం అమెరికా కాంగ్రెస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతటి భారీ ఖర్చుతో కూడిన యుద్ధాన్ని పెంటగాన్ ఎంతకాలం కొనసాగించగలదనే దానిపై చర్చలు మొదలయ్యాయి.
News March 11, 2026
ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే?

ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు బిడ్డకు కవచంలా ఉంటూ ఇన్‌ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది. ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే అమ్మకు ఆయాసం ఎక్కువవుతుంది. ఏడో నెల తర్వాతయితే మరింత ఇబ్బంది అవుతుంది. నొప్పులు తొందరగా వస్తాయి. నిర్ణీత కాలం కంటే ముందుగానే ప్రసవం అయిపోతుంది. ఒక్కోసారి బేబీ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఉమ్మనీరు ఎంత ఉందో చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


