News January 9, 2025
సోషల్ మీడియాలో మరో హీరోయిన్‌కు వేధింపులు

సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతోపాటు తన కుటుంబాన్ని కూడా అంతమొందిస్తానని అతడు హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్యా బెదిరింపుల వల్ల తాను తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు ఆమె వాపోయారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల హీరోయిన్ హనీ రోజ్‌ను కూడా ఓ వ్యాపారవేత్త వేధించిన విషయం తెలిసిందే.
Similar News
News January 22, 2026
ప్రభాస్ ‘రాజాసాబ్’కు దారుణమైన కలెక్షన్లు

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. నిన్న దేశవ్యాప్తంగా థియేటర్లలో రూ.0.48 కోట్లు(15%- థియేటర్ ఆక్యుపెన్సీ) వసూలు చేసిందని sacnilk తెలిపింది. తొలి వారం రూ.130 కోట్ల(నెట్) కలెక్ట్ చేయగా 13 రోజుల్లో మొత్తంగా రూ.141.98 కోట్లు రాబట్టినట్లు వెల్లడించింది. కాగా ఇప్పటివరకు ఈ మూవీ 55శాతమే రికవరీ చేసిందని సినీ వర్గాలు తెలిపాయి.
News January 22, 2026
NALCOలో 110 పోస్టులు.. అప్లై చేశారా?

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<
News January 22, 2026
గురు గ్రహ బలం పెంచుకోవాలంటే..?

గురు గ్రహ బలం పెంచుకోవాలంటే మహిళలు పుట్టింటి నుంచి తెచ్చిన దీపపు కుందులతో నిత్యం దీపారాధన చేయాలి. చీమలు ఎక్కువగా ఉన్న చోట చక్కెరను ఆహారంగా చల్లాలి. సాధువులకు నెయ్యి దానం చేయడం శుభప్రదం. ఇంటికి పడమర దిశలోని శివాలయంలో బ్రాహ్మణులకు బియ్యం దానమివ్వాలి. ఇంటి ఈశాన్యంలో 9 వత్తుల నేతి దీపం వెలిగించాలి. గురుస్తోత్రం పఠించడం మరింత శ్రేష్ఠం. వేంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల గురు గ్రహ బలం చేకూరుతుంది.


