News April 15, 2025
రాష్ట్రంలో మరో పరువు హత్య?

AP: మతాంతర వివాహం చేసుకున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. చిత్తూరుకు చెందిన సాయితేజ, యాస్మిన్ బాను బీటెక్ చదివే సమయంలో ప్రేమించుకున్నారు. అతడు ఎస్సీ కావడంతో యాస్మిన్ పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో వారు FEBలో పెళ్లి చేసుకున్నారు. యాస్మిన్ పేరెంట్స్ పదేపదే కాల్ చేయడంతో సాయితేజ ఆదివారం తన భార్యను పంపాడు. ఆ తర్వాతి రోజే యాస్మిన్ మరణించింది. పుట్టింటి వారే చంపేశారని సాయితేజ ఆరోపిస్తున్నాడు.
Similar News
News January 6, 2026
రేపు పోలవరానికి సీఎం చంద్రబాబు

AP: పోలవరం ప్రాజెక్టును CM చంద్రబాబు రేపు సందర్శించనున్నారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించనున్నారు. 10AMకు క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్లో పోలవరం వెళ్లనున్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్, డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు పర్యవేక్షిస్తారు. తర్వాత అక్కడే అధికారులతో సమీక్షిస్తారు. కాగా ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 87.8% మేర జరిగింది.
News January 6, 2026
హైకోర్టుకు చిరు, ప్రభాస్ సినిమాల నిర్మాతలు

టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతి కోసం రాజాసాబ్, మనశంకరవరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు TG హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరలు పెంచకుండా గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. దాని ఆధారంగా టికెట్ రేట్లు, ప్రత్యేక షోలపై క్లారిటీ రానుంది. కాగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే సర్కారుకు దరఖాస్తు చేశారు.
News January 6, 2026
సంక్రాంతికి మరో రెండు స్పెషల్ రైళ్లు

సంక్రాంతికి మరో 2 స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) తెలిపింది. 18వ తేదీన రాత్రి 11 గంటలకు విశాఖపట్నం నుంచి చర్లపల్లికి ట్రైన్ బయల్దేరనుంది. 19న మధ్యాహ్నం 3.30కు చర్లపల్లి నుంచి విశాఖకు రైలు స్టార్ట్ అవుతుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. రేపు ఉదయం నుంచి బుకింగ్స్ ఓపెన్ అవుతాయి.


