News June 25, 2024

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

image

AP: మెగా DSCతో పాటు TET నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించిన TETలో పాస్ కాని వారు, తాజాగా B.ED, D.ED పూర్తి చేసిన వారికోసం ఈ నిర్ణయం తీసుకుంది. జులై 1న నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మొదట టెట్ నిర్వహించి, ఆ తర్వాత DSC ప్రిపరేషన్‌కు 30 రోజుల సమయం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక నుంచి ప్రతి ఏడాదీ డీఎస్సీ నిర్వహించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Similar News

News April 7, 2026

అల్లు అర్జున్- అట్లీ మూవీ నుంచి అప్డేట్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ‘AA22xA6’ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. రేపు 11AMకి టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తామని ప్రకటిస్తూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.

News April 7, 2026

చిరంజీవి చొరవ చూపాలి: కేశినేని చిన్ని

image

AP: గత ప్రభుత్వం సినీ పరిశ్రమను హింసిస్తే తాము ఎంతో గౌరవిస్తున్నామని MP కేశినేని చిన్ని తెలిపారు. త్వరలోనే నంది అవార్డులు ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు. ‘అవసరమైనప్పుడు ఇండస్ట్రీతో చర్చిస్తాం. ఇందుకు చిరంజీవి చొరవ చూపాలి. టాలీవుడ్‌కు 65% ఆదాయం వచ్చే APలో కనీసం 25% షూటింగ్స్ జరిపితే బాగుంటుంది. ఇక్కడ ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

News April 7, 2026

ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలే!

image

2026 వర్షాకాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే 6% తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వెల్లడించింది. ఎల్ నినో ప్రభావం వల్ల జులై నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు తక్కువగా కురుస్తాయని అంచనా వేసింది. ఈ ఏడాది కరవు వచ్చే ముప్పు 30% ఉందని, సగటు వర్షపాతం 94%కే పరిమితం కావచ్చని తెలిపింది. భారత వాతావరణ శాఖ (IMD) కూడా త్వరలోనే తన తొలి అధికారిక అంచనాలను విడుదల చేయనుంది.