News July 20, 2024

‘రుణమాఫీ’పై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

image

TG: పంట రుణాల మాఫీపై ప్రీ ఆడిట్ నిర్వహించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనికోసం 16 వేల మంది రైతుల రుణ ఖాతాలను పరిగణనలోకి తీసుకోనుంది. ఆడిట్ పూర్తయ్యే వరకు వారి ఖాతాల్లో నిధులు జమకావని తెలిపింది. మరోవైపు దాదాపు లక్షకు పైగా ఖాతాల్లో అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిపై విచారణ జరిపిన తర్వాతే రుణమాఫీ నిధులు జమ చేయనుంది.

Similar News

News January 8, 2026

సోదరికి గుడి కట్టి దేవతలా కొలుస్తున్నాడు!

image

AP: నెల్లూరు జిల్లా వెంకటాచలంలో అపురూపమైన సోదర బంధం వెల్లివిరిసింది. 14 ఏళ్ల క్రితం ప్రమాదంలో మరణించిన అటవీ శాఖాధికారి సుబ్బలక్ష్మి జ్ఞాపకార్థం ఆమె సోదరుడు ఏకంగా ఓ ఆలయాన్ని నిర్మించారు. ఆమెను దేవతగా కొలుస్తూ గత 14 ఏళ్లుగా నిత్య పూజలు, ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరణం తన సోదరిని భౌతికంగా దూరం చేసినా గుడి కట్టి ఆరాధిస్తున్న ఆ సోదరుడిపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.

News January 8, 2026

ఇండస్ట్రీయల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

ఇండస్ట్రీయల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (<>IFCI<<>>) 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 21 వరకు contract@ifciltd.com ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BCA/BE/BTech/MTech/MCA, MBA, ICAI, ME, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ifciltd.com

News January 8, 2026

వివాహ వ్యవస్థ గొప్పతనం

image

హిందూ సంస్కృతిలో వివాహం ముఖ్యమైన సంస్కారం! సమాజంలో గృహస్థాశ్రమానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. వివాహం వ్యక్తిని బాధ్యతాయుత మార్గంలో నడిపిస్తుంది. వేదాలు వివాహాన్ని పవిత్రమైనదిగాను, లోక కళ్యాణానికి మార్గంగాను అభివర్ణించాయి. అందుకే దీనిని యజ్ఞంలా భావిస్తారు. మహర్షులు, పురాణకర్తలు తమ రచనల ద్వారా వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని చాటిచెప్పి, మనిషిని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దే మార్గాన్ని సుగమం చేశారు. <<-se>>#Pendli<<>>