News September 8, 2024
మరో ఘటన.. గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ వాగులోకి..

ఇటీవల విజయవాడలో గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని తల్లీకొడుకు బుడమేరు వాగులో చిక్కుకున్న ఘటన తరహాలోనే మరొకటి జరిగింది. శ్రీశైలం దర్శనం ముగించుకున్న 9 మంది గూగుల్ మ్యాప్ పెట్టుకొని కారులో రిటర్న్ అయ్యారు. అయితే అది వారిని నేరుగా TGలోని నాగర్ కర్నూల్ జిల్లా సిర్సవాడ దుందుభి వాగులోకి తీసుకెళ్లింది. అక్కడ చిక్కుకున్న వారిని గ్రామస్థుల సహాయంతో పోలీసులు ట్రాక్టర్‌తో క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.
Similar News
News December 4, 2025
తిరుపతి SVUలో ఇంత దారుణమా..?

తిరుపతి SVU పరిధిలో 1991 నుంచి 2015 వరకు డిగ్రీ చదివిన వాళ్లు సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవడానికి గతేడాది ఆగస్టులో నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక్కో పేపర్‌కు రూ.2వేలు, 3పేపర్లకు మించితే రూ.4వేలు చొప్పున ఫీజు కట్టించుకున్నారు. ఇప్పటి వరకు పరీక్షల షెడ్యూల్ ఇవ్వలేదు. డబ్బులు కట్టి సంవత్సరం దాటుతున్నా పరీక్షల తేదీ వెల్లడించకపోవడంతో SVUలో ఇంత దారుణమా? అని అందరూ విమర్శిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.
News December 4, 2025
రాష్ట్రంలో 4 వేల ఖాళీలు!

TG: ఎస్సీ గురుకుల సొసైటీలో 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా TGSWREISకు 9,735 మంది పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం 5,763 మంది మాత్రమే పనిచేస్తున్నారు. పలు శాఖల్లో అధికారులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని స్థాయిల్లో కలిపి 4,725 ఖాళీలు ఉన్నాయని, వీటిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక శాఖను కోరితే 4వేలకు అనుమతిచ్చిందని సమాచారం.
News December 4, 2025
PCOS వస్తే జీవితాంతం తగ్గదా?

పీసీఓఎస్ అనేది దీర్ఘకాలిక సమస్యే. కానీ ఆరోగ్యకర జీవనశైలి పాటిస్తే దీన్ని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బరువు అదుపులో ఉండాలి. వ్యాయామం చేయడం మీ జీవనశైలిలో ఒక భాగం కావాలి. హార్మోన్ల అసమతుల్యతను, మెటబాలిక్ సమస్యల్ని సరిచేయడానికి వైద్యులను సంప్రదించి మందులు వాడాలి. అలాగే గర్భం నిలవకపోతే అండం విడుదల కోసం కూడా మంచి మందులున్నాయి. కాబట్టి భయపడక్కర్లేదని సూచిస్తున్నారు.


