News November 20, 2024

మరో ఫుడ్ పాయిజన్ ఘటన.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత

image

TG: రాష్ట్రంలో మరో ఫుడ్‌పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా మాగనూర్‌ జడ్పీ స్కూల్‌లో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని స్కూళ్లలో అసలేం జరుగుతోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Similar News

News December 4, 2025

డిసెంబర్ 7న ప్రజావంచన దిన నిరసనలు: బీజేపీ

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొదలై డిసెంబర్ 7 నాటికి రెండేళ్లు కావస్తున్న సందర్భంగా నిర్వహించే ప్రజా పాలన ఉత్సవాలను వ్యతిరేకిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు తెలిపారు. ఆ రోజున ప్రజా వంచన దినంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జ్‌షీట్ విడుదల చేస్తామని ప్రకటించారు.

News December 4, 2025

మంచి మార్కులు రావాలంటే.. ఇలా చేయండి

image

పిల్లలు మంచి మార్కులు సాధించాలంటే స్థిరమైన అలవాట్లు, సరైన మైండ్‌సెట్‌ అవసరం. రోజూ 30 నుంచి 45 నిమిషాలు అయినా చదవాలి. క్లాస్‌రూమ్‌లో ప్రశ్నలు అడగడం వల్ల సబ్జెక్టుపై అవగాహన పెరుగుతుంది. చెప్పిన పాఠాలను రివిజన్ చేయడం వల్ల విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. పుస్తకాలు, స్కూల్ బ్యాగ్‌ను సక్రమంగా సర్దుకోవాలి. రోజూ కనీసం 8 గంటలు నిద్రపోవాలి. పడుకునే ముందు డిజిటల్‌ స్క్రీన్‌లకు దూరంగా ఉండాలి.

News December 4, 2025

రబీ(యాసంగి) వరి – విత్తన శుద్ధి ఎలా చేయాలి?

image

పంటలో తెగుళ్ల ఉద్ధృతి తగ్గాలంటే విత్తన శుద్ధి చేయడం కీలకం. వరిలో కేజీ పొడి విత్తనానికి కార్బండజిమ్ 3గ్రాములను కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. తడి విత్తనానికి లీటరు నీటిలో కార్బండజిమ్ 1గ్రామును కలిపి ఆ ద్రావణంలో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి మండి కట్టి మొలకెత్తిన విత్తనాన్ని నారుమడిలో లేదా దమ్ము చేసి వెదజల్లే పద్ధతిలో విత్తనాన్ని పలుచని పొర నీటిలో చల్లుకోవాలి. తర్వాత నీటిని పూర్తిగా తీసివేయాలి.