News July 3, 2024

అన్‌అకాడమీలో మరోసారి ఉద్యోగాల కోత

image

వివిధ విభాగాలకు చెందిన 250 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ అన్అకాడమీ ప్రకటించింది. ఆర్థికభారం సహా వ్యాపారాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ తొలగింపు చేపట్టినట్లు తెలిపింది. కాగా ఈ సంస్థ ఇలా లేఆఫ్స్ ప్రకటించడం ఇది మూడోసారి. గత ఏడాది మార్చిలో సుమారు 380 మందిని తొలగించగా, 2022 ఏప్రిల్‌లో దాదాపు వెయ్యి మందిని తప్పించింది.

Similar News

News July 6, 2024

అమరావతి ORRకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

image

AP: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. భూసేకరణ సహా మొత్తం రూ.20-25 వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించనుంది. ఉమ్మడి కృష్ణా, GNT జిల్లాల్లో CRDA పరిధిలో 189కి.మీ మేర ఈ ORRని నిర్మిస్తారు. అలాగే VJA తూర్పు బైపాస్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతి- HYD మధ్య 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, మేదరమెట్ల- అమరావతి రహదారి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించింది.

News July 6, 2024

ఆ రోజుల్లో బ్రేక్ దర్శనాలు రద్దు

image

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 9, 16 తేదీల్లో బ్రేక్ దర్శనాన్ని రద్దు చేశారు. 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16న సాలకట్ల ఆణివార ఆస్థాన పర్వదినం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు గమనించాలని పేర్కొంది.

News July 6, 2024

నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేటి నుంచి 3 రోజులు పులివెందులలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్టుకి జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. 2 రోజుల పాటు ఆయన కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నెల 8న ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.