News December 25, 2024
ఉచిత బస్సు ప్రయాణంపై మరో కీలక పరిణామం

AP: మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అక్కడ అమలవుతోన్న మహాలక్ష్మీ పథకం గురించి ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం అక్కడ తీసుకున్న నిర్ణయాలు, విధివిధానాల గురించి రేవంత్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు మంత్రులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే.
Similar News
News September 23, 2025
నేడు శ్రీ గాయత్రీ దేవి అవతారం.. ఏ పూలతో పూజ చేయాలి?

దసరా నవరాత్రుల్లో రెండో రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తారు.. ఈ రూపంలో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి, పంచ ముఖాలు, పది కళ్లతో, భూమి, ఆకాశం, సృష్టిని సూచించే రంగుల కిరీటంతో ముక్తా, హేమ, నీల, విద్రుమ, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ ఉంటారు. ఈ రోజున అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పించాలి. పసుపు రంగు పూలతో పూజించాలి. ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదించాలి.
News September 23, 2025
రోజూ గాయత్రీ మంత్రం పఠిస్తే..

‘ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి! ధియో యో నః ప్రచోదయాత్!!’ అనే గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదని పురాణాలు చెబుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చొని జపం చేయాలి. ఇలా రోజూ చేస్తే జీవితంలో ఒత్తిడి, ఆందోళన తగ్గి సంతోషం, గెలుపు దక్కుతాయని, దుఃఖం, బాధలు, దారిద్ర్యం, పాపాలన్నీ తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు.
News September 23, 2025
ఆర్టీసీ ఉద్యోగులకు దసరా అడ్వాన్స్: సజ్జనార్

TG: ఆర్టీసీ ఉద్యోగులకు దసరా పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ఉద్యోగుల హోదా, నెల జీతం ఆధారంగా అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. తిరిగి వారి జీతం నుంచి నెలకు కొంత మొత్తంలో వసూలు చేస్తామని పేర్కొంది. ఈ మేరకు అధికారులతో సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే అడ్వాన్స్ చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.