News September 24, 2025
మరో అల్పపీడనం.. భారీ వర్షాలు

AP: రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం వరకు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఐదు రోజుల పాటు రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది.
Similar News
News February 9, 2026
నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్‌లో 47 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

బెంగళూరులోని CSIR-నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ 47 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. గ్రాడ్యుయేట్(బీఈ, బీటెక్), డిప్లొమా అర్హత గల వారు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ ట్రైనీలకు ఫిబ్రవరి 10న, డిప్లొమా ట్రైనీలకు ఫిబ్రవరి 11న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,300, డిప్లొమా ట్రైనీలకు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nal.res.in/
News February 9, 2026
ముగ్గురు సిస్టర్స్ సూసైడ్.. BIG TWIST

ఘజియాబాద్‌లో ముగ్గురు సిస్టర్స్ <<19060937>>సూసైడ్<<>> కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసుల విచారణలో తండ్రి చేతన్ పొంతనలేని సమాధానాలిచ్చాడు. అతనికి ముగ్గురు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారనే విషయం వెలుగులోకొచ్చింది. వీరంతా ఒకే రూములో నిద్రించేవారు. మరి ఆ ముగ్గురు బయటికెళ్తుంటే చూడలేదా అనే ప్రశ్నకు ‘ఇది వారి డైలీ రొటీన్‌లో భాగం’ అని తండ్రి చెప్పడం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
News February 9, 2026
లోక్‌సభ రేపటికి వాయిదా

విపక్షాల ఆందోళన మధ్య లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. ఇవాళ ఉదయం సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. ఈక్రమంలోనే LoP రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనా విపక్షాలు ఆందోళన చేపట్టడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.


