News December 24, 2024
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. వర్షాలు

AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో శుక్రవారం వరకు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. 25, 26, 27 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల.. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడతాయని వివరించింది. కోస్తా తీరంలో 35-55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. కోస్తాలోని అన్ని పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Similar News
News October 18, 2025
నేడు మద్యం, మాంసం వద్దు! ఎందుకంటే..?

ధన త్రయోదశి పర్వ దినాన మాంసం, మద్యం వంటి తామసిక ఆహారాన్ని తీసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. లేకపోతే లక్ష్మీ కటాక్షం కలగదని అంటున్నారు. ‘నలుపు రంగు వస్తువులు కొనుగోలు చేయకూడదు. గృహోపకరణాలు దానం చేయడం, అమ్మడం వంటివి చేయకండి. నేడు ఎవరికీ రుణం ఇవ్వకూడదు. ఇంట్లో ఏ మూలనా చీకటి లేకుండా, ప్రతి చోట పరిశుభ్రత, దీపాల వెలుగు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది’ అని సూచిస్తున్నారు.
News October 18, 2025
సమ్మె విరమించిన విద్యుత్ ఉద్యోగ సంఘాలు

AP: విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ నాయకులతో 12 గంటలు సుధీర్ఘంగా జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రధాన డిమాండ్లకు యాజమాన్యాలు ఒప్పుకోవడంతో సమ్మె విరమిస్తున్నట్లు JAC నాయకులు ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు, వారికి నేరుగా ప్రభుత్వం జీతాలు చెల్లించేందుకు అంగీకరించింది. 1999-2004 మధ్య ఎంపికైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంపై కమిటీకి కూడా అంగీకారం లభించింది.
News October 18, 2025
ధన త్రయోదశి ఎందుకు జరుపుకొంటారు?

ధంతేరస్ను జరుపుకోవడానికి ప్రధాన కారణం.. ఈ రోజున ఆరోగ్య ప్రదాత ధన్వంతరి క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించడం. ఈ పండుగను దీపావళికి శుభారంభంగా పరిగణిస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించడం వల్ల సంపద, శ్రేయస్సు కలుగుతాయి. నూతన పెట్టుబడులకు, విలువైన వస్తువుల కొనుగోలుకు ఇది శుభ సమయం. అలాగే ఇల్లు, మనస్సులను శుద్ధి చేసుకొని పండుగకు సిద్ధపడడం ద్వారా ఆనందం, అదృష్టం లభిస్తాయని ఈ పండుగ తెలియజేస్తుంది.