News September 22, 2025

నక్సలైట్లపై మరో మేజర్ విక్టరీ: అమిత్‌షా

image

నక్సలైట్లపై భద్రతా బలగాలు మరో మేజర్ విక్టరీ సాధించాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్(D) అబూఝ్‌మాడ్ అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డిలను మట్టుబెట్టాయని ట్వీట్ చేశారు. బలగాలు ప్లాన్ ప్రకారం నక్సల్స్ టాప్ లీడర్స్‌ను అంతమొందిస్తున్నాయని అన్నారు. కాగా చనిపోయిన ఇద్దరిపై రూ.40 లక్షల చొప్పున రివార్డు ఉంది.

Similar News

News September 22, 2025

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు: APSDMA

image

AP: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

News September 22, 2025

వయసు కాదు.. ధైర్యమే ముఖ్యం!

image

ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అని నిరూపించారు 77 ఏళ్ల రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ సోహన్ రాయ్. పుణేకు చెందిన సోహన్ తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉమ్లింగ్ లాను అధిరోహించి ఔరా అనిపించారు. లద్దాక్‌లోని 19,024 అడుగుల ఎత్తైన ఈ ప్రాంతానికి ఆయన చేసిన ప్రయాణం సాహసానికి, సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. ఇక్కడి భిన్నమైన వాతావరణంతో పాటు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి.

News September 22, 2025

యూరియాతో తీవ్ర నష్టం: సీఎం

image

AP: యూరియా ఎక్కువగా వాడటం వల్ల పాలు కూడా కలుషితం అవుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ‘యూరియా వల్ల ప్రజారోగ్యం, పంట ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. రసాయనాలు, యూరియా అధిక వినియోగంపై రైతుల్ని చైతన్యపర్చాల్సి ఉంది. బాధ్యతలేని నాయకులు ఎరువులు ఇవ్వలేదని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సర్టిఫికేషన్ ఇచ్చిన ఆహారాన్నే తీసుకుంటున్న ఆ నేతలు రైతులను మోసగిస్తున్నారు’ అని అసెంబ్లీలో విమర్శించారు.